MOVIE NEWS

ఇండియన్ 3 పై శంకర్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!!

తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ గుర్తింపు తెచ్చుకున్నారు.శంకర్ సినిమాలు గ్రాండ్ విజువల్స్ తో భారీగా ఉండటమే కాక ప్రేక్షకులకు సందేశాత్మకంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం శంకర్ గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో “గేమ్ ఛేంజర్” తెరకెక్కిస్తున్నాడు.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” కు సీక్వెల్ గా తెరకెక్కడంతో సినీ ప్రియులంతా ఇండియన్ 2పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇండియన్ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది..శంకర్ కెరీర్ లో ఈ చిత్రం భారీ ప్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ 2 రివ్యూలు, ఇండియన్ 3పై దర్శకుడు శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఇండియన్ 2 మీద వచ్చిన నెగిటివ్ రివ్యూలపై స్పందించారు.

పవర్ స్టార్ వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న ఆ స్టార్ రైటర్..!!

ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ 2 మీద ఈ స్థాయిలో నెగిటివ్ రివ్యూలను నేను అస్సలు ఊహించలేదు. కాకపోతే ఆ సినిమా ఎఫెక్ట్ నుంచి త్వరగానే మూవ్ ఆన్ అయ్యాను. ఇక త్వరలో రిలీజ్ కాబోయే గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 ఫలితాలే నా ప్రతిభ గురించి మాట్లాడతాయి. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచవనీ హామీ ఇస్తున్నాను.. థియేటర్స్ లో ఈ సినిమాలు చూసి గొప్ప అనుభూతి పొందుతారు అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక ఇండియన్ 3 థియేటర్స్ లోనే విడుదల అవుతుందని కమల్ అభిమానులకు శంకర్ శుభవార్త చెప్పుకొచ్చారు. తన కామెంట్స్ తో మరోసారి ఇండియన్ 3 సినిమాపై శంకర్ భారీ అంచనాలు పెంచారు.

Related posts

మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

మంగళవారం డైరెక్టర్ కే ఎందుకిలా….

filmybowl

అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!!

murali

Leave a Comment