MOVIE NEWS

పుష్ప2 టైటిల్ సాంగ్ రిలీజ్.. డిలీటెడ్ సీన్స్ అదిరిపోయాయిగా.!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మరోసారి బన్నీ సరసన హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ‘సామ్ సిఎస్’ అడిషనల్ గా బిజీఎం అందించి ఆకట్టుకున్నాడు.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు..

రిలీజ్ కు ముందు ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే పుష్ప 2 కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.. టికెట్ రేట్స్ బాగా ఎక్కువగా వున్నా కూడా ఆడియన్స్ ఏ మాత్రం లెక్కచేయకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసారు.. ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా 294 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.. కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..10 రోజుల్లో పుష్ప 2 సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది..లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో అని సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారు..

ప్రభాస్ ‘రాజసాబ్’ టీజర్ రన్ టైం లాక్..!!

పుష్ప 2 సినిమా హక్కులు ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది..ఈ సినిమా జనవరి 8 లేదా 9 న స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ వరుసగా వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు.. మొన్న ఈ సినిమాలో సూపర్ హిట్ అయిన పీలింగ్స్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా తాజాగా పుష్ప పుష్ప అనే టైటిల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.. అయితే ఈ సాంగ్ లో కొన్ని కొత్త సీన్స్ మేకర్స్ యాడ్ చేసారు.. ఈ సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి.. అయితే వీటిని ఎందుకు డిలీట్ చేసారని వారు మేకర్స్ ని ప్రశ్నిస్తున్నారు..

Related posts

వార్ 2- ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు మరో ఇద్దరు బడా హీరోలు ?

filmybowl

రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా..?

murali

చరణ్ మీద ఎంతో భారం…. మోస్తాడంటారా…

filmybowl

Leave a Comment