పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది “కల్కి” సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ‘రాజా సాబ్’ ఒకటి..హార్రర్ కామెడీ జోనర్‌లో వస్తోన్న రాజాసాబ్ మూవీని 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు..
సినిమా షూటింగ్‌కు సంబంధించి అభిమానుల్లో నెలకొన్న డైలామాకు దర్శకుడు మారుతీ చెక్ పెట్టాడు.తాజాగా అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి ప్రమోషనల్ ఈవెంట్‌లో రాజాసాబ్ షూటింగ్ పూర్తయిందని ఆయన క్లారిటీ ఇచ్చేశాడు.అయితే రాజాసాబ్ అనుకున్న సమయానికి రావడం లేదన్న వార్త ఒకటి ఫ్యాన్స్ ని నిరాశ చెందేలా చేస్తుంది. రాజాసాబ్ విడుదల వాయిదా పడిందని వార్తలు వస్తుండగా.. మరోవైపు మీరు ఏ డేట్‌కు చూడాలనుకుంటే బాగుంటదో అదే తేదీన రాజాసాబ్ వస్తుందని మారుతి చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి..ఇదిలా ఉంటే త్వరలో రాజాసాబ్ టీజర్ రిలీజ్ కానుంది.. ఈ టీజర్ రన్‌టైం 2 నిమిషాల 15 సెకన్లు అని సమాచారం.
థియేటర్ లో బెడిసి కొట్టినా.. ఓటిటీలో కుమ్మేస్తున్న కంగువా..!!
ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు ..ఈ సినిమా తరువాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2 కూడా తెరకెక్కబోతుంది.. ఈ సినిమాలన్నీ పూర్తి అయ్యాక ప్రభాస్ కల్కి పార్ట్ 2 లో నటించనున్నాడు..ఈ లెక్కన ప్రభాస్ మరో 5 ఏళ్ల వరకు వరుస సినిమాలతో బిజీగా ఉండనున్నట్లు తెలుస్తుంది..