దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, రాంచరణ్ ఈ సినిమాలో కలిసి నటించారు.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.. 2022 మార్చిలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాను హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లు సైతం ఎంతగానో మెచ్చుకున్నారు.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి.. ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకం అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు తో పాటు ఆస్కార్ అవార్డు కూడా రావడంతో గ్లోబల్ వైడ్ గా తెలుగు సినిమాకు అరుదైన గౌరవం దక్కింది..
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ అనే అదిరిపోయే సాంగ్ కి గాను మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణికి అలాగే ప్రముఖ రచయిత చంద్రబోస్ కి ఆస్కార్ అవార్డ్స్ లభించాయి..ఇండియన్ సినీ హిస్టరీ లో ఓ తెలుగు సినిమాకి ఆస్కార్ రావడమనేది ఎంతో గొప్ప విషయం.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు ఇంతటి క్రేజ్ తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి పేరు మారు మ్రోగి పోయింది.అంతటి సంచలనము సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.. అదేంటి ట్రైలర్ మళ్లీ రావడం ఏంటీ అనుకుంటున్నారా.అవును..ఈ మూవీకి సంబంధించిన బెస్ట్ ఎక్స పీరియన్స్ లను షేర్ చేసుకుంటూ ఆ సినిమా వెనక కథను తెలుపుతూ డాక్యుమెంటరీని దర్శకుడు రాజమౌళి సెట్ చేస్తున్నాడు..
ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..?
తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ ని ఈ నెల 20న కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు.ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్స్ తో ఈ మూవీ అనౌన్స అయినప్పుడు అందర్లోనూ ఎంతో ఎగ్జైట్మెంట్ కనిపించింది. దాని వెనక ఉన్న కథేంటీ.. ఆ మూవీ చిత్రీకరణ సమయంలో ఎదురైన టఫ్ మూమెంట్స్ ఏంటీ.. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఒపీనియన్ ఏంటీ అనేది ఈ డాక్యుమెంటరీలో మేకర్స్ చూపించనున్నారు… అలాగే ఈ సినిమాలో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న కొన్ని సన్నివేశాలను ఏ విధంగా చిత్రీకరించారు. అలాగే ఆస్కార్ వేదికపై ఎమోషనల్ మూమెంట్స్ ను కూడా మేకర్స్ చూపించబోతున్నారు.