MOVIE NEWS

మావయ్య నాగబాబుని కలిసిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్..!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.. డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కేవలం పది రోజుల్లో 1200కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. అయితే పుష్ప సినిమా అల్లుఅర్జున్ కి క్రేజ్ తో పాటు వివాదాలు కూడా తెచ్చిపెట్టింది.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అల్లుఅర్జున్ జీవితానికి మాయని మచ్చలా మిగిలింది.. ఈ ఘటన కారణంగా అల్లుఅర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది..

అల్లుఅర్జున్ కి సపోర్ట్ గా మెగా ఫ్యామిలీ,ఫ్యాన్స్ నిలబడ్డారు.. బన్నికి మధ్యంతర బెయిల్ ఇచ్చినా కూడా ఒక రాత్రంతా జైలులో ఉంచడం ఫ్యాన్స్ అందిరిని కలిచివేసింది.. జైలు నుంచి విడుదల అయిన అల్లుఅర్జున్ కష్ట సమయంలో తోడుగా నిలబడ్డ ఫ్యాన్స్ కి మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు.. అలాగే పలువురు టాలీవుడ్ ప్రముఖులు అల్లుఅర్జున్ కి సపోర్ట్ గా నిలిచారు.. సినిమా స్టార్స్ ని అరెస్ట్ చేసి పాపులర్ అవ్వలనుకునే నాయకులు చరిత్రపుటల్లో కనుమరుగయి పోయారు.. బన్నీకి ఎలాంటి సంబంధం లేని ఘటనలో భాద్యుడిని చేయడం చాలా తప్పు.. జరిగిన ఘటన బాధాకరం.. కానీ ఆ ఘటన మొత్తానికి అల్లుఅర్జున్ ని భాద్యుడిని చేయడం తప్పు అని సినీ ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు..

ఎస్ఎస్ఎంబి : మహేష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఈ ఘటనపై నేషనల్ మీడియా సైతం అల్లుఅర్జున్ కి సపోర్ట్ గా నిలిచింది.. జైలు నుంచి విడుదల అయిన తరువాత బన్నీ తన భార్యతో కలిసి తనకు సపోర్ట్ గా నిలిచిన మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లడం జరిగింది.. ఆయనతో కాసేపు ముచ్చటించిన అల్లుఅర్జున్ ఆ తరువాత చిన్న మావయ్య నాగబాబు ఇంటికి కూడా వెళ్లడం జరిగింది..జరిగిన ఘటన అంతటిని అల్లుఅర్జున్ నాగబాబుకి వివరించారు.. ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

Related posts

సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!!

murali

పుష్ప 2 : మ్యూజిక్ కాంట్రవర్సీ..దేవిశ్రీ కామెంట్స్ పై స్పందించిన ప్రొడ్యూసర్..!!

murali

నాని – మాస్టర్ క్లాస్ సక్సెస్ ఫుల్ హీరో

filmybowl

Leave a Comment