గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.. ఎస్. జె. సూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను మేకర్స్ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు… ఈ సందర్భం గా నిర్మాత దిల్ రాజు దేశ విదేశాల్లో భారీ ఈవెంట్స్ ను ప్లాన్ చేశారు.
సుకుమార్ డైరెక్ట్ చేసిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ అతి తక్కువ రోజుల్లో వెయ్యి కోట్ల గ్రాస్ ను వసూలు చేయడంతో భారీ స్థాయిలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న శంకర్ ‘గేమ్ ఛేంజర్’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని అంతా భావిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ నెల 21న అమెరికాలో ఈ చిత్రం ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా మొదలు పెడుతున్నారు. అక్కడ జరిగే భారీ ఈవెంట్ కు దర్శకుడు సుకుమార్ గెస్ట్ గా హాజరవుతాడని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి బిగ్ అప్డేట్..యాక్షన్ సీక్వెన్స్ తో హైప్ ఎక్కిస్తున్న మేకర్స్..!!
ఇదే సమయంలో సినిమా విడుదలకు ముందు హైదరాబాద్ లో నిర్వహించే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రాజమౌళిని ఆహ్వానిస్తున్నారని సమాచారం. రామ్ చరణ్ తో సుకుమార్ ‘రంగస్థలం’ చిత్రాన్ని రూపొందించగా, రాజమౌళి ‘మగధీర, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలను తెరకెక్కించారు.దీనితో చరణ్ సినిమా ప్రమోషన్స్ లో వీరిద్దరూ హాజరయి సినిమాకి భారీ హైప్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది..