MOVIE NEWS

బన్నీ నేషనల్ అవార్డు పై సరికొత్త రచ్చ.. అసలు ఏం జరుగుతుంది..?

టాలీవుడ్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళింది అని ఆనందించే లోపే ప్రస్తుతం ఇండస్ట్రీ లో జరుగుతున్న వరుస ఘటనలు సినీ లవర్స్ కి చిరాకు తెప్పిస్తున్నాయి..ప్రస్తుతం అల్లుఅర్జున్ అరెస్ట్ రచ్చ దేశం అంతా స్ప్రెడ్ అయింది.. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగింది.. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. అయితే ప్రీమియర్ షో చూసేందుకు అభిమానులతో కలిసి సంధ్య థియేటర్ కి వెళ్లిన అల్లుఅర్జున్ ని చూసేందుకు ఫ్యాన్స్ విపరీతంగా వచ్చారు.. పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ తో ఓ ర్యాలీ లా వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది..

మెగాస్టార్ మావయ్యకి కృతజ్ఞతలు.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ ..!!

ఆ తొక్కిసలాటలో రేవతి అనే యువతీ మృతి చెందింది.. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో వున్నాడు.. దీనితో తెలంగాణ పోలీసులు ఈ ఘటనకి అల్లుఅర్జున్ ని భాద్యుడిగా చేస్తూ నిన్న అరెస్ట్ చేసారు…తాజాగా అల్లు అర్జున్ బెయిల్ పై బయటకి వచ్చారు..అల్లు అర్జున్ ని కావాలనే ఈ కేసులో ఇరికించారని చాలా మంది ప్రముఖులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే ఈ అంశం మరిన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చింది.. గతంలో జానీ మాస్టర్ జైలుకి వెళ్లడం సంచలనంగా మారిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆ ఘటన వెనుక కొందరి హీరోల ప్రమేయముందనే టాక్ ఆ మధ్య జోరుగా నడిచింది…

జాతీయ అవార్డు తనకు మాత్రమే ఉండాలని భావించి ఆ హీరో.. తన టీమ్‌తో కలిసి కుట్ర పన్నినట్టు వార్తలు కూడా వచ్చాయి… జానీ మాస్టార్‌కు న్యాయస్థానం మధ్యంతర బెయిల్  ఇవ్వడంతో, వెంటనే ఆయనకు ఇచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలంటూ కొందరు లేఖలు కూడా రాశారట.దీనితో జానీ మాస్టర్ కి కేంద్రం నేషనల్ అవార్డు నిలిపివేసింది.. అయితే తొక్కిసలాట కేసులో నిందితుడుగా అల్లు అర్జున్ కూడా ఉండటంతో ఆయన కూడా నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తారా..అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది.

Related posts

ఎన్టీఆర్ తో పాటు సైఫ్ ని పొగిడితీరాల్సిందే

filmybowl

ప్రభాస్ లుక్ పై మరోసారి పెదవి విరుస్తున్న నెట్టిజన్లు…

filmybowl

ఫ్యాన్స్ తో కలిసి “పుష్ప 2” చూడబోతున్న ఐకాన్ స్టార్..!!

murali

Leave a Comment