ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ని తాజాగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.హైదరాబాద్ సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కారణంగా రేవతి అనే యువతీ మరణించింది.. ఆమె కొడుకు హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నాడు.ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ రావడంతో ఈ ఘటన జరిగింది.. ఇదిలా ఉంటే తాజాగా హైకోర్టులో అల్లు అర్జున్ కి భారీ ఊరట లభించింది. పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించారు.దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ తక్షమే బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని అల్లు అర్జున్ తరపున న్యాయవాది కోరగా.. కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించడం జరిగింది..క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదావేస్తే తక్షణమే బెయిల్ మంజూరుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరారు.. డానికి ప్రభుత్వ తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని గట్టిగా వాదించారు.
బెయిల్ అలాగే క్వాష్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వ లాయర్ న్యాయమూర్తిని కోరారు. తన క్లైంట్‌పై పెట్టిన కేసు కొట్టేయాలని 118 (1) బీఎన్‌ఎస్ అల్లు అర్జున్‌కు వర్తించదని లాయర్ నిరంజన్ రెడ్డి కూడా ఎంతో బలంగా వాదించారు. అయితే అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే మీ అభ్యంతరం ఏమిటని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు.అల్లు అర్జున్ కావాలని ఈ ఘటనకు పాల్పడలేదని.. తనకి ఈ ఘటనతో అసలు ఎలాంటి సంబంధం లేదని నిరంజన్ రెడ్డి వాదించారు.ఇద్దరి న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు.