ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ న్యూస్ తెలిసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.. పుష్ప 2 ప్రీమియర్ షో ఫ్యాన్స్ తో చూసేందుకు సంధ్య థియేటర్ కి వచ్చిన అల్లుఅర్జున్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తప్పుచేసారు.. దీనితో భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది..ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది.. ఆమె కొడుకు హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నాడు.. అనుమతి లేకుండా అక్కడికి వచ్చినందుకు అల్లుఅర్జున్ ని తాజాగా పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
అల్లుఅర్జున్ అరెస్ట్.. కెటీఆర్ సంచలన ట్వీట్..!!
అల్లు అర్జున్ మీద మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు పెట్టగా అందులో 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు అని తెలుస్తుంది. దీనితో 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం.BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తన మేనల్లుడు అరెస్ట్ అయ్యాడు అనే విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ హుటాహుటిన తన సోదరుడు అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు.
అల్లుడు అరెస్టు అయ్యాడు అనే విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర షూటింగ్ రద్దు చేసుకుని మరీ బయలుదేరి వచ్చారు.అల్లు అర్జున్ కుటుంబ సభ్యులను వారు ఓదారుస్తున్నారు.మెగాస్టార్ దంపతులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. గాంధీ హాస్పిటల్ కి అల్లు అర్జున్ ని వైద్య పరీక్షల కోసం పోలీసులు తీసుకువెళ్లగా అవి పూర్తి కావడంతో నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు.