MOVIE NEWS

అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తేసిన రష్మిక..ఆ సీన్స్ చూసి స్టన్ అయిపోయా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప 2 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు…ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.. ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా తాజాగా 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది.

కేవలం విడుదలైన ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి పుష్ప 2 సినిమా చరిత్ర సృష్టించింది.  తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది.అయితే పుష్ప 2 సినిమాకి సెకండ్ హాఫ్ మాత్రం చాలా కీలకంగా మారింది… అందులోని జాతర సీన్ కోసం ప్రేక్షకులు రెండు,మూడు సార్లు థియేటర్స్ కి వచ్చిన సందర్భాలు కూడా వున్నాయి… దాదాపుగా 60 కోట్లు ఖర్చు చేసి మరీ మేకర్స్ ఈ సీన్ ను తెరకెక్కించారు.. జాతర సీన్స్ పుష్ప 2 సినిమాకే హైలెట్ గా నిలిచాయి… అయితే ఇంతటి సంచలం సృష్టించిన ఈ సీన్ గురించి నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..

అఖండ 2 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది..దసరాకు అసలైన తాండవం షురూ..!!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. ‘ఇంత బాగా ఆ సీన్ చేయగలిగిన ఏకైక హీరో అల్లు అర్జున్ సర్ మాత్రమే అని ఆమె చెప్పింది.నా జీవితంలో ఇలాంటి సీన్ మళ్ళీ చూస్తానని అస్సలు అనుకోట్లేదు..అల్లు అర్జున్ సర్ లాంటి హార్డ్ వర్కర్ ని నేనెక్కడ చూడలేదు.. మాస్ హీరోగా పిచ్చ క్రేజ్ వున్న అల్లుఅర్జున్ గారు చీర కట్టుకొని డ్యాన్స్ చేయడం , చీరలోనే యాక్షన్ సీక్వెన్సెస్ చేయడం,చీరలోనే డైలాగ్స్ చెప్పాడం నాకైతే షాకింగ్ అనిపించింది.. సినిమాలో 21 నిమిషాల పాటు అల్లు అర్జున్ సర్ చీర కట్టుకొనే ఉన్నారు.. అసలు ఏ స్టార్ హీరో ఇలా చేస్తారు.ఏ స్టార్ అయినా దీనికి ఒప్పుకుంటారా..ఈ సీన్స్ తర్వాత నాకు ఆయన మీద ఉన్న గౌరవం మరింత పెరిగింది.. నా జీవితం మొత్తం అతన్ని సపోర్ట్ చేస్తుంటాను’ అని రష్మిక తెలిపింది..

Related posts

OG : పవన్ కల్యాణ్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

murali

ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో..?

murali

Leave a Comment