MOVIE NEWS

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ సాధించి దూసుకుపోతుంది..ప్రస్తుతం దేశం అంతా పుష్ప రాజ్ మేనియాతో ఊగిపోతుంది..పుష్ప 2 లో అల్లు అర్జున్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది..పుష్ప 2’మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది.. ఈ సినిమా ఏకంగా 5 రోజుల్లోనే 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించింది.త్వరలోనే వెయ్యి కోట్ల మార్క్ ను పుష్ప 2 క్రాస్ చేయనుంది..ప్రస్తుతం అల్లుఅర్జున్ పుష్ప 2 సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘పుష్ప 2 ‘ చిత్రం తర్వాత అల్లుఅర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మూవీ లో నటించబోతున్న సంగతి తెలిసిందే.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని సుమారుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడని సమాచారం.. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఐకాన్ స్టార్ సినిమాతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగుపెడుతున్నాడు…

డాకు మహారాజ్ : ఫస్ట్ సింగిల్ లోడింగ్ ఎప్పుడంటే..?

గతంలో కేవలం ఫ్యామిలీ మూవీస్, కమర్షియల్ మూవీస్ మాత్రమే చేసిన త్రివిక్రమ్ . మొట్టమొదటి సారి తన కంఫర్ట్ జోన్ ని వదిలి, భారీ బడ్జెట్ పీరియడ్ మూవీ తీయనుండటంతో  ఫ్యాన్స్ అందరిలో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి…ఇప్పటి వరకు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి సెన్సేషనల్ మూవీస్ వచ్చాయి.

టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ గా వీరికి మంచి పేరొచ్చింది.. ‘పుష్ప 2’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఎక్కడా తగ్గకుండా ఉండేట్టు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నాడట. జనవరి మొదటి వారంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ షూట్ చేస్తారని సమాచారం., అదే విధంగా మార్చి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని నిర్మాత నాగవంశీ తెలిపారు..

Related posts

మెగాస్టార్ లిస్ట్ లోకి మరో యంగ్ డైరెక్టర్.. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగుతుందా..?

murali

OG పెద్ద రేంజ్ హిట్ అవుతుంది – ఎస్ ఎస్ థమన్

filmybowl

పుష్ప 2 : సినిమాలో ఆ సీన్స్ లేపేసిన సుకుమార్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!!

murali

Leave a Comment