MOVIE NEWS

పుష్ప 2 : క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా.. ఇదిగో ప్రూఫ్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు..రిలీజ్ అయిన మొదటి షో నుంచే పుష్ప 2 సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది.. ఈ సినిమాలో అల్లు అర్జున్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ అదిరిపోతుంది..పుష్ప 2 సినిమా పాన్ ఇండియా లెవెల్లో మొదటి రోజు దాదాపు 294 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఈ నాలుగు రోజుల్లో పుష్ప 2 సినిమా ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్‌లో సడన్‌గా ఓ సస్పెన్స్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ పాత్ర పార్ట్ 3కి అదిరిపోయే లీడ్ ఇస్తుంది… ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు..అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు..పుష్ప 2 క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరనే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది..చాలామంది ఆ వ్యక్తి టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండనే అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అదే టైంలో పుష్ప సినిమాలో కీలక పాత్రలో కనిపించిన ఫహద్ ఫాజిట్‌ మళ్లీ బతికి రానున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

ఐకాన్ స్టార్ పుష్ప 2 పై రోజా మాస్ రివ్యూ అదిరిపోయిందిగా..!!

పుష్ప 2 క్లైమాక్స్‌లో పుష్పరాజ్‌ తన అన్న కూతురు  పెళ్ళి వేడుకలో సందడి చేస్తారు. అందులో అందరూ ఆనందంగా ఉన్న టైంలో.. భారీ బాంబు పేలినట్లుగా వినిపిస్తుంది. కట్ చేస్తే స్క్రీన్ పై రిమోట్ పట్టుకొని.. ఒక్క అన్ రివీల్డ్‌ వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. స్క్రీన్ పై అతని ముఖం మాత్రం కనిపించదు. ఈ క్రమంలోనే ఎస్పీ భన్వర్ సింగ్ షేకావత్ పుష్ప రాజ్ పై రివేంజ్‌ తీర్చుకోవడానికి అలాంటి ప్లాన్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు..అయితే అగ్ని ప్రమాదంలో చనిపోయిన షెకావత్ పగ తీర్చుకునేందుకు మళ్ళీ బ్రతికొచ్చాడని.దీనికి కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తూ క్లైమాక్స్ లో కనిపించే వ్యక్తి చెయ్యి చాలా సన్నగా ఉంది. అలాగే చేతులపై కాలిన గాయాలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Related posts

చందూ… ఈ సారి భారీ పిరియాడిక‌ల్ డ్రామా

filmybowl

ముదురుతున్న మంచు వారింట రచ్చ..ఎక్కడికి దారితీస్తుందో..?

murali

ఆ స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీ.. కొరటాల స్కెచ్ అదిరిందిగా..!!

murali

Leave a Comment