MOVIE NEWS

డాకు మహారాజ్ : డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య.. బాబీ పనితనానికి ఫిదా అయ్యరుగా..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది..ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ మరియు చాందిని చౌదరిలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది.

ముదురుతున్న మంచు వారింట రచ్చ..ఎక్కడికి దారితీస్తుందో..?

ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్‌లో బాలకృష్ణ సరికొత్త లుక్,అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించాడు… టైటిల్ టీజర్ లో తమన్ ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో సరికొత్త బాలకృష్ణను చూస్తారని చిత్ర యునిట్ ఎంతో నమ్మకంగా చెబుతోంది. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ముగించి గుమ్మడి కాయ కొట్టిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసారు.కాగా ఈ సినిమాను జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

తాజాగా బాలయ్య ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ ఫినిష్ చేసారు. అయితే మొత్తం సినిమా చూసుకుని డబ్బింగ్ ఫినిష్ అయ్యాక డాకు మహారాజ్ టీమ్ ను బాలయ్య అభినందిచారట. అలాగే డైరెక్టర్ బాబీని ప్రత్యేకంగా అప్రిషియేట్ చేసినట్లు సమాచారం. అఖండ సినిమా ఏ రేంజ్ లో ఉందో అదే రేంజ్ లో ఈ సినిమా కూడా ఉందని బాబీకి బాలయ్య కంగ్రాట్స్ చెప్పారట. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మేకర్స్ ఈ నెల 15న తర్వాత మొదలు పెట్టనున్నట్లు సమాచారం.న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

Related posts

పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..?

murali

‘వార్‌ 2’ నుంచి ఎక్స్సైటింగ్ అప్డేట్‌….

filmybowl

గేమ్ ఛేంజర్ : ట్విస్టుల మీద ట్విస్టులు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!!

murali

Leave a Comment