విలక్షణ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.. దాదాపు 500 సినిమాలకు పైగా నటించిన మోహన్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.. ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ సినిమాలలో హీరోలుగా నటించినా కూడా మోహన్ బాబు అలరించిన స్థాయిలో వారు అలరించలేకపోయారు.. కానీ తండ్రికి తగ్గ తనయులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..
ఆర్జీవి : పుష్ప రాజ్ ముందు అల్లు అర్జున్ సైతం దిగదుడుపే..!!
మంచు విష్ణు తెలుగు సినీ “మా” అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వున్నారు.. మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా వున్నా తాజాగా కొన్ని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.. ఇదిలా ఉంటే మంచు కుటుంబంలో ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కింది. గతంలో మాటల యుద్ధం కొనసాగించిన మంచు బ్రదర్స్ ఇటివల సైలెంట్ అయిపోయారు… కానీ నేడు మరోసారి మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసినట్లు సమాచారం..మోహన్ బాబు తనని తన భార్యని కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేసాడని న్యూస్ వైరల్ అయింది… అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు న్యూస్ బాగా వైరల్ అయింది.
తండ్రి కొడుకులు ఒకరిమీద ఒకరు కేసులు పెటుకున్నారు అనే వార్త టాలీవుడ్ లో చర్చానీయాంశం గా మారింది.స్కూల్, ఆస్తుల వ్యవహారంలో గత కొద్దీ రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తున్నట్లు తెలుస్తుంది..అయితే .ఈ వ్యవహారంపై మంచు మోహన్ బాబుకు చెందిన పిఆర్ టీమ్ స్పందించింది. మోహన్ బాబు గారు మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు కల్పిత కధనాలను కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి.ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు ప్రచారం చేయవద్దని కోరింది..