ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అల్లుఅర్జున్ పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిపోయారు.సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి.. ఇదిలా ఉంటే ఇండియన్ సినీ హిస్టరీలో ఇలాంటి పదునైన పాత్రలు చాలా అరుదుగా వస్తాయని, పుష్పరాజ్‌లాంటి పాత్రలో నటించి ఆకట్టుకోవడం అంత సామాన్యమైన విషయం కాదని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేసాడు..
ఈ మూడు రోజులు అస్సలు సంతోషమే లేదు..మమ్మల్ని క్షమించండి.. సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్..!!
పుష్ప 2 లో అల్లు అర్జున్ నటనపై తన అభిప్రాయాన్ని ఆర్జీవీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ఒక స్టార్ హీరో తన ఇమేజ్‌ను కూడా పక్కకు పెట్టి, ఇలాంటి పాత్రలో నటించడం చాలా అరుదు. ‘పుష్పరాజ్’ లాంటి పాత్రలు ఎంతో అరుదుగా వస్తాయి… సినిమా చూస్తున్నంత సేపు నిజ జీవితంలో పుష్పలాంటి పాత్ర ఉంటుందని ఒక సగటు ప్రేక్షకుడిగా నాకూ అనిపించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న ఒక సినిమాలో నిజంగా అలాంటి పాత్రను చూపించడం అంత సులభమైన విషయం కాదు.
పుష్ప పాత్ర అనేది ఎన్నో వైవిధ్యాలతో కూడుకున్నది. వైకల్యం కలిగిన ఒక వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే సూపర్ హీరోకు ఉండే నిర్వచనం వేరు. దాని ప్రకారం సూపర్ హీరో అన్నింటిలోనూ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. కానీ, పుష్ప క్యారెక్టర్‌లో నటించిన అల్లు అర్జున్ సూపర్‌హీరోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు.ఎప్పుడూ చూడని బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ఆ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయని ఆర్జీవి ట్వీట్ చేసారు…పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ జీవించాడు..’పుష్ప2′ గ్రేట్ జర్నీని ఆస్వాదించాక ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ‘పుష్పరాజ్’ పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా తక్కువే అనిపించాడు” అని ఆర్జీవి తెలిపారు..