MOVIE NEWS

ఏకంగా నాలుగు పాన్ ఇండియా హిట్స్.. ఆ కన్నడ విలన్ జోరు మాములుగా లేదుగా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో పుష్ప రాజ్‌తో పాటు హీరోయిన్ రష్మిక అద్భుతంగా నటించింది.సినిమాలో ప్రతీ సీన్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించింది..పుష్ప రాజ్, షెకావత్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అల్టిమేట్ అని చెప్పొచ్చు.. ఈ సినిమాలో అసలైన విలన్ ను దర్శకుడు సుకుమార్ క్లైమాక్స్ లో పరిచయం చేస్తాడు.. అల్లు అర్జున్‌ని ఇబ్బంది పెట్టే బుగ్గారెడ్డి పాత్రలో ఓ నటుడు రెచ్చిపోయి నటించాడు. శిథిలావస్థలో ఉన్న కాళీ విగ్రహం ముందు చిత్రీకరించిన బిగ్గెస్ట్ క్లైమాక్స్ యాక్షన్ సీన్ అదిరిపోతుంది..బుగ్గారెడ్డి పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది..

డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్స్..!!

”పుష్ప 2’ ట్రైలర్‌లో సగం బట్టతల విలన్‌ను చూపించినప్పుడు ఆ పాత్ర ఎవరిదై ఉంటుందా అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలయ్యాక జనాల్లో ‘బుగ్గారెడ్డి’ పేరు బాగా నానుతోంది. బుగ్గారెడ్డి పాత్రలో నటించిన ఆ నటుడి పేరు తారక పొన్నప్ప.ఇతను ప్రముఖ కన్నడ స్టార్. దక్షిణాది అగ్ర విలన్‌లలో ఒకడిగా ప్రతీ సినిమాలో అదర గొడుతున్నాడు.ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర: పార్ట్ 1’లో కూడా తారక్ పొన్నప్ప విలన్ గా నటించాడు… ఇందులో మెయిన్ విలన్ సైఫ్ అలీఖాన్ కొడుకు పాసుర పాత్రలో తారక పొన్నప్ప కనిపించాడు.

అలాగే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కన్నడ సెన్సేషనల్ మూవీస్ KGF: చాప్టర్ 1, KGF చాప్టర్ 2లో కూడా నటించాడు. ఈ ఫ్రాంచైజీలో దయా పాత్రలో తారక్ పొన్నప్ప అద్భుతంగా నటించారు. ‘కేజీఎఫ్ 1’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో పాపులర్ అయిన తారక్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే పుష్ప 2 తో కలిపి ఏకంగా నాలుగు పాన్ ఇండియా హిట్ లు అందుకున్నాడు.. దీనితో ఈ యంగ్ విలన్ కి టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి..

Related posts

బాల‌య్య కోరిక‌లు నెరవేరుతున్నాయి

filmybowl

మెగాస్టార్ సినిమాపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..!!

murali

RC16 : మ్యూజిక్ విషయంలో సూపర్ ట్విస్టు.. రెహమాన్ ప్లేస్ లో దేవిశ్రీ..?

murali

Leave a Comment