MOVIE NEWS

ఖైదీ 2 : ఆ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేస్తున్నారా..?

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది… ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఆ సమయంలో తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘విజిల్’పోటీగా ఉన్నప్పటికీ.. వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించి ‘ఖైదీ’ సినిమా చరిత్ర సృష్టించింది.ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ టేకింగ్, సినిమాటోగ్రఫీ అన్నిటికంటే మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి..

పుష్ప 2 :ఆ కీలక సన్నివేశాలు ఎడిట్ చేసిన సుకుమార్.. దాని కోసమేనా..?

‘ఖైదీ’ సినిమాలో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తెరకెక్కించారు… ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఖైదీ 2’ వస్తుందని.. మేకర్స్ ఆ సినిమా రిలీజ్ టైంలోనే ప్రకటించారు. సినిమా క్లైమాక్స్ లో లీడ్ కూడా ఇవ్వడం జరిగింది.అయితే అంతా బాగానే ఉంది.. కానీ 5 ఏళ్ళు అయినా ‘ఖైదీ 2’ స్టార్ట్ అవ్వకపోవడంతో ఈ ప్రాజెక్టు అసలు ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై కార్తీ క్లారిటీ ఇచ్చాడు. నెక్స్ట్ ప్రాజెక్టు ‘ఖైదీ 2’ అని కార్తీ స్పష్టం చేశారు.అది ‘ఢిల్లీ’ టైటిల్ తో ఉంటుంది అని తెలిపాడు. అయితే ‘ఖైదీ 2’ కి మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా మార్చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది…

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమాలు అన్నిటికీ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. లోకేష్ డైరెక్ట్ చేస్తున్న ‘కూలీ’ సినిమా కి కూడా అతనే మ్యూజిక్ అందిస్తున్నాడు..దీంతో ఢిల్లీ సినిమాకి కూడా అతనే అని రూమర్స్ వైరల్ అవుతున్నాయి… ‘ఖైదీ’ సినిమా కి సామ్ సి ఎస్ మ్యూజిక్ అందించాడు.పాటలు లేని ఆ సినిమాలో సామ్ సి ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని ఎలా తప్పిస్తారు అనే డిస్కషన్స్ ప్రస్తుతం జోరుగా నడుస్తున్నట్లు సమాచారం..

Related posts

NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?

murali

లుక్ చేంజ్ చేసిన మహేష్..రాజమౌళి సినిమా హోల్డ్ లో పడిందా ..?

murali

ఆ టాలెంటెడ్ దర్శకుడికి దిల్ రాజు ఛాన్స్ ఇస్తున్నాడట

filmybowl

Leave a Comment