MOVIE NEWS

పుష్ప 2 : 90 శాతం బిజిఎం నాదే..సామ్ సిఎస్ షాకింగ్ కామెంట్స్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే హీరోయిన్ గా నటించిన రష్మిక సైతం అద్భుతంగా నటించింది.ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది..

నేను కాపీ చేసే రకం కాదు.. దేవిశ్రీ షాకింగ్ కామెంట్స్..!!

ఇదిలా ఉంటే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు గతంలో ఎంతో రచ్చ జరిగింది.. దేవిశ్రీని కాదని మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ను పుష్ప 2 బిజిఏం ఇవ్వమని కోరగా వారిలో సామ్ సిఎస్ మ్యూజిక్ ని మేకర్స్ ఓకే చేసారు..సామ్ సిఎస్ పేరుని మేకర్స్ టైటిల్ కార్డులో అడిషినల్ అని వేశారు కానీ ఇటీవలే ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 90 శాతం బిజిఎం తనదేనని చెప్పడంతో ఫ్యాన్స్ మధ్య కొత్త చర్చకు దారి తీసింది.విడుదలకు రెండు వారాల నుంచే హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంలోకి తమన్ పేరు రావడం, నేను ఫస్టాఫ్ కు పని చేశానని తను ఒక ఈవెంట్లో చెప్పడం రకరకాల ఊహాగానాలకు తెరలేపింది.

ఫైనల్ గా దేవి, సామ్ మాత్రమే హైలైట్ అయ్యారు.అయితే పాటలు వేర్వేరుగా కంపోజ్ చేస్తే ఎవరు ఏ సాంగ్ అనేది గుర్తుపట్టొచ్చు. కానీ బిజిఎంకు అలా పసిగట్టడం సాధ్యం కాదు.సామ్ సిఎస్ మాట్లాడుతూ “నేను మాములుగా ఏ సినిమాకైనా పని చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ మొత్తం చదువుతాను. కానీ పుష్ప 2 సినిమాకు అలా కుదరలేదు. ఎందుకంటే ఎడిటింగ్ అయ్యాక నేను ఈ సినిమాలో చేరాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో చాలా పని ఒత్తిడి ఉంటుంది. నేను మొత్తం మూవీకి పని చేశాను. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కొంత అలాగే ఉంచినప్పటికీ క్లైమాక్స్ తో పాటు 90 శాతం నేను కంపోజ్ చేసిందేనని చెప్పుకొచ్చాడు.. నిర్మాణ సంస్థ త్వరగా పనులు పూర్తి చేసే ఉద్దేశంతో నన్ను తీసుకుంది. ఒక ప్రేక్షకుడిగా నేను ఇందులో భాగమై నా వంతుగా పుష్ప 2కి బెస్ట్ ఇవ్వడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు..

Related posts

ప్రభాస్ కోసం మరో ‘లెజెండరీ యాక్టర్ ని తీసుకొస్తున్న మైత్రి మూవీ మేకర్స్

filmybowl

పుష్ప 2 : ఐకాన్ స్టార్ సినిమాకి ఆ మెగా హీరో బెస్ట్ విషెస్..

murali

రామాయణాన్ని ఇలా వాడేశారు

filmybowl

Leave a Comment