MOVIE NEWS

ఎన్టీఆర్ ఫ్యాన్స్ బిగ్ సర్ప్రైజ్.. నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. దాదాపు ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా ఎన్టీఆర్ సినిమా రావడంతో దేవర సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలోవిలన్ గా నటించాడు.. ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన దేవర సినిమాకి మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి పాన్ ఇండియా వైడ్ వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమాకు ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి..

పుష్ప 2 : దర్శకుడు సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన తరువాత సినిమాల విషయంలో మాత్రం పక్కా ప్లాన్ లో ఉన్నాడు… ఈక్రమంలోనే దేవర తరువాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి చేస్తోన్న భారీ మల్టీ స్టారర్ సినిమా “వార్ 2” ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.ఈసినిమా పూర్తి అయిన తరువాత ఎన్టీఆర్ వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.అందుకోసం ఏర్పాట్లు కూడా శరవేగంగా చేస్తున్నట్లు సమాచారం . అంతే కాదు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ లుక్ కూడా రిలీజ్అయ్యింది. ఇక సినిమా స్టార్ట్ చేసే రోజునే టైటిల్ ను కూడా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

అయితే వీరి కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాకు ”డ్రాగన్“ అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్టే అని సమాచారం.ఎన్టీఆర్ ని సరికొత్తగా చూపించేలా అద్భుతమైన క్యారెక్టర్ ను రాసుకున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈసినిమాలో తారక్ పాత్రలో కాస్త నెగెటీవ్ టచ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది .కాగా ఈ సినిమా టైటిల్ ను సంక్రాంతికి అఫీషియల్‌గా ప్రకటించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ కూడా అప్పుడే మొదలు పెట్టనున్నట్లు సమాచారం…

Related posts

పుష్ప 2 : ట్రైలర్ కు ఫిదా అయిన రాజమౌళి..ఆగలేకపోతున్నా అంటూ ట్వీట్..!!

murali

ప్రభాస్ స్పిరిట్ కోసం సంధీప్ రెడ్డి వంగ 500 కోట్ల భారీ బడ్జెట్.

filmybowl

హమ్మయ్య పుష్ప పార్ట్ 3 పై క్లారిటీ వచ్చేసింది.. టైటిల్ అదిరిందిగా..!!

murali

Leave a Comment