MOVIE NEWS

పుష్ప 2 : దర్శకుడు సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..గత నెల రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ తో మేకర్స్ చాలా బిజీ గా వున్నారు.. పాట్నా, చెన్నై,కొచ్చి, ముంబై లో భారీ ఈవెంట్స్ ఏర్పాటు చేసారు..చివరిగా హైదరాబాద్ లో మేకర్స్ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసారు..ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

హమ్మయ్య పుష్ప పార్ట్ 3 పై క్లారిటీ వచ్చేసింది.. టైటిల్ అదిరిందిగా..!!

గతంలో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి. మరికొన్ని గంటలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈసారి అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తారని ఫ్యాన్స్ ఎంతో ధీమాగా వున్నారు..ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించి ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది.

ఈ సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.దాదాపు 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ సుకుమార్ తీసుకున్నట్లుతెలుస్తుంది., ఇది మాత్రమే కాకుండా పుష్ప 2 కి వచ్చే లాభాల్లోనూ సుకుమార్ వాటాదారుడుగా ఉన్నారు. సుకుమార్ ఇదివరకే వచ్చిన పుష్ప పార్ట్ 1 కి నిర్మాణంలో భాగస్వామి కాలేదు..కానీ పార్ట్ 2 కి మాత్రం మైత్రి మూవీ మేకర్స్ తో కలిపి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు వచ్చే లాభాలలో భారీ స్థాయిలో వాటా ఉండనున్నట్లు తెలుస్తుంది.

Related posts

ట్రిపుల్ ధమాకా కి సిద్దం అవ్వండి రెబల్ ఫ్యాన్స్

filmybowl

బాల‌య్య కోరిక‌లు నెరవేరుతున్నాయి

filmybowl

ప్రభాస్ ‘స్పిరిట్’లో ఆ స్టార్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మావ..?

murali

Leave a Comment