ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు..గతంలోవచ్చిన పుష్ప మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. పుష్ప 2 సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఆ స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీ.. కొరటాల స్కెచ్ అదిరిందిగా..!!
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాకు భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు.. పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై ఇలా వరుసగా భారీ ఈవెంట్స్ నిర్వహించి పుష్ప సినిమాపై మేకర్స్ ఊహించని హైప్ క్రియేట్ చేసారు.. నేడు హైదరాబాద్ యూసఫ్ గూడాలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.. ఈ ఈవెంట్ కి భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు.. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాకు టికెట్ రేట్స్ పెంచుతూ రెండు తెలుగు రాష్ట్రాలు కీలక ఉత్తర్వులు జారీ చేసాయి..
ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం. నైజాంలో పుష్ప -2 కి ఎన్నడూ లేని రేట్లు ఇస్తూ జీవో జారీ చేసింది.డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతోపాటు అర్థరాత్రి 1 గంట షోలకు టికెట్ ధరలు రూ.1121 సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ రూ. 1239 గా ఖరారు చేసింది. ఇక డిసెంబరు 5 న రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ ధర రూ. 354, మల్టీఫ్లెక్స్ లో రూ. 531 గాఖరారు చేసింది.. ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప 2 టికెట్ రేట్లు భారీగా పెంచింది..డిసెంబర్ 4 న ప్రీమియర్ షో రాత్రి 9.30 గంటలకు ఒక టికెట్ రూ. 800 గా నిర్ణయించింది..డిసెంబర్ 5 నుంచి 17 వరకు గరిష్టంగా రూ. 200 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..మల్టీ ప్లెక్స్ లలో రూ. 200 అలాగే సింగిల్ స్క్రీన్ లోయర్ క్లాస్ రూ. 100 అప్పర్ క్లాస్ రూ 150 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది..