MOVIE NEWS

శంకర్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్స్ అలాగే పాన్ ఇండియా డైరెక్టర్స్ పుట్టుకొస్తున్నారు.. అయితే పాన్ ఇండియా అనే క్రేజ్ మొదలు కాకముందే ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలు దేశమంతా మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.. ఆయన సినిమా వస్తుందంటే చాలు దేశమంతా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వుంటారు..ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు దర్శకుడు శంకర్..డైరెక్టర్ రాజమౌళి కన్నా ముందే పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు శంకర్. ప్రస్తుతం ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా పాన్ ఇండియా మార్కెట్ కి మార్గం చూపింది కూడా దర్శకుడు శంకర్ అనే చెప్పాలి.. అలాగే సరికొత్త టెక్నాలజీతో సినిమా తీయాలన్నా కూడా శంకర్ కి సాటి ఎవరూ రాలేరు.. అప్పట్లోనే ఎన్నో ప్రయోగాలు చేసి దర్శకుడు శంకర్ భారీ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు..

కోలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ డైరెక్షర్ గా పాపులారిటీ సంపాదించుకున్న “శంకర్” . భారతీయుడు , ఒకే ఒక్కడు, అపరిచితుడు , రోబో లాంటి ఎన్నో భారీ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.. అయితే శంకర్ సినిమా అంటే మాత్రం నిర్మాతలు భయపడుతూ వుంటారు..ఆయన చెప్పిన బడ్జెట్ ఒకటి తెరకెక్కించే బడ్జెట్ మరోకటి అనే టాక్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది .కానీ పెట్టిన ఖర్చు అంతా స్క్రీన్ పై గ్రాండ్ గా కనిపించేలా శంకర్ చర్యలు తీసుకుంటాడు..

గేమ్ ఛేంజర్ : “నానా హైరానా” లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..!!

ప్రస్తుతం శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజెర్ అనే మూవీ ని తెరకెక్కించాడు . ఈ సినిమా జనవరి 10వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.అయితే ఈ సినిమా సక్సెస్ శంకర్ కు చాలా అవసరం.. తాను తెరకెక్కించిన భారతీయుడు 2 సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో శంకర్ ఆశలన్ని గేమ్ చేంజర్ పైనే వున్నాయి…అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏకంగా అమెరికాలో జరపడానికి శంకర్ నిశ్చయించుకున్నారు . దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది.ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన థర్డ్ సింగిల్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది…

ఇదిలా ఉంటే శంకర్ నెక్స్ట్ ఏ హీరోతో సినిమా తెరకెక్కించబోతున్నాడు అనే విషయం బాగా వైరల్ గా మారింది.అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కించిన తర్వాత ఆ రేంజ్ హీరోతోనే సినిమా తెరకెక్కిస్తే బాగుంటుంది అంటూ వార్తలు వినిపించాయి. దీనితో శంకర్ కూడా తన నెక్స్ట్ సినిమా ఇంకో స్టార్ హీరోతో ప్లాన్ చేసాడని సమాచారం.ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవితో శంకర్ ప్రతిష్టాత్మకమైన సినిమాను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నారట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది .ఒక యూనిక్ కాన్సెప్ట్ తో శంకర్ – చిరంజీవి కోసం ఒక మూవీను ప్లాన్ చేసినట్లు సమాచారం..

Related posts

శ్రీ తేజ్ ని పరామర్శించా..కానీ పబ్లిసిటీ చేసుకోలేదు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్..!!

murali

చరణ్ మూవీ కోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!!

murali

“పుష్ప 2” మొదటి షో పడింది.. ఇంతకీ టాక్ ఎలా ఉందంటే..?

murali

Leave a Comment