MOVIE NEWS

7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!

తమిళ్ టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన తమిళ్ సినిమా 7/G రెయిన్ బో కాలనీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ తెలుగులో ఈ సినిమా 7/G బృందావన్ కాలనీ టైటిల్ తో రిలీజ్ అయింది..2004లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ్ లో భారీ విజయం సాధించి క్లాసిక్ సినిమాలా నిలిచింది.

ఎస్ఎస్ఎంబి : హమ్మయ్య ఎట్టకేలకు మొదలు పెడుతున్న జక్కన్న..!!

ఇక ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ఎంతగానో పాపులర్ అయి ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి.7G బృందావన కాలనీ సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఇటీవలే ఈ సినిమా రీ రిలీజ్ కూడా అయి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది… ఇదిలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు..గతంలో పలుమార్లు నిర్మాత, దర్శకుడు ఈ సీక్వెల్ గురించి ఓపెన్ గానే మాట్లాడారు. అయితే నేడు న్యూ ఇయర్ సందర్భంగా ఈ క్లాసిక్ సినిమాకు సీక్వెల్ ను అధికారికంగా అనౌన్స్ చేసారు.ఈ క్లాసిక్ సినిమా సీక్వెల్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది… ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం పూర్తయినట్టు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎఎం. రత్నం నిర్మాణంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ హీరోగానే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ సోనియా అగర్వాల్ చనిపోయినట్టు చూపించారు కాబట్టి పార్ట్ 2 లో కొత్త హీరోయిన్ ని తీసుకున్నారు. ఈ సీక్వెల్ లో అనశ్వర రాజన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే జయరామ్, సుమన్ శెట్టి, సుధ.. లాంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇక ఫస్ట్ పార్ట్ కి అద్భుతమైన పాటలు ఇచ్చిన యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు..

Related posts

“పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!!

murali

ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు

filmybowl

అఖండ 2 తాండవం…. అదరహో….

filmybowl

Leave a Comment