35 chinna katha Movie Review
తారాగణం: నివేథా థామస్, విశ్వదేవ్ , ప్రియదర్శి, మాస్టర్ అరుణ్, భాగ్యరాజ్, రేవతి, కృష్ణతేజ తదితరులు
ప్రొడక్షన్: సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ , వాల్టాయిర్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్స్: సృజన్ యరబోలు, సిద్దార్థ్ రాళ్ళపల్లి
రైటర్ & డైరేక్షన్: నందకిశోర్ యేమాని
మ్యూజిక్: వివేక్ సాగర్
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 6, 2024
చిన్న సినిమా , పెద్ద సినిమా అంటూ ఏమి లేదు
రిలీజ్ కి ముందు ఏదైనా చిన్న సినిమానే…. ప్రేక్షకుడు ఆదరించిన సినిమానే పెద్ద సినిమా అన్నట్టుంది ఈరోజు ఇండస్ట్రీ
బడా హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలని రెండేళ్ల కి ఒక సరి రిలీజ్ కి వస్తుంటే ఈ లోపు చిన్న సినిమా వాటి హవా ని చూపించేసి వెళ్తున్నాయి. కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ ఎంత పెద్ద విజయాలు సాధించాయి అందరికి తెలిసిందే అలాగే ఇప్పుడు ఈ 35 chinna katha Kadu కూడా అంతటి విజయాన్ని సాధించింది అనటం లో సందేహం లేదు
దగ్గుబాటి రానా లాంటి పెద్ద స్టార్ చేయి పడితే ఆ సినిమా ప్రమోషన్స్ కి కొదవేముంటది. అందుకే రిలీజ్ కి ముందే ఈ సినిమా మంచి బజ్ ని సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఒక లుక్కేద్దాం పదండి
కథ :
ప్రసాద్ (విశ్వదేవ్) , సరస్వతి (నివేధా) తిరుపతి లో నివాసముండే ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం
వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అరుణ్ (పెద్దొడు) , వరుణ్ (చిన్నోడు). అన్ని మధ్య తరగతి కుటుంబాల్లో లాగే సరస్వతి కి భర్త, పిల్లలే ప్రపంచం. పిల్లలని బాగా చదివించి వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలనీ కష్టపడుతుంటారు.
చిన్నోడు వరుణ్ బాగా చదువుతాడు , ఆలా అని అరుణ్ చదువురానోడు ఎం కాదు. లెక్కలు తప్ప అన్నిట్లో మంచి మార్క్స్ వస్తాయి. లెక్కల్లో ఎందుకు వీక్ అనేది కూడా దర్శకుడు చక్కగా చూపించాడు. అరుణ్ అడిగిన సందేహాల్ని ఉపాధ్యాయులు తీర్చకపోడం తో అరుణ్ కి గణితం మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. అలా చదవకపోడం తో గణితం లో సున్నాలు వస్తుంటాయి.
అదే సమయం లో ఆ స్కూల్ కి వచ్చిన కొత్త లెక్కల మాస్టర్ చాణక్య (ప్రియదర్శి) వల్ల అరుణ్ కి ఇబ్బందులు మొదలవుతాయి. ఆ ఇబ్బందులు వల్ల కుటుంబం వరకు వెళ్లి అరుణ్ ఇల్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితి కి వస్తాడు .
ఇల్లు వదిలి వెళ్లిన అరుణ్ తిరిగి వచ్చాడా లేదా?.
తనకి గణితం మీద ఉన్న ఆలోచనని ఎవరు మార్చారు?
ఈ సారి ఐన పాస్ అయ్యాడా లేదా అనేది మిగతా కథ…. అది సినిమా చూసి తెలుసుకుందాం
సినిమా ఎలా ఉంది:
సినిమా అంటే పాటలు , ఫైట్లు , మాస్, రొమాన్స్ , కాస్త అడల్ట్ కంటెంట్ ఇవే నేటి సినిమాలు
వాటికి బిన్నంగా తయారైన సినిమా ఇది.
మధ్యతరగతి బంధాలు ఎన్ని సార్లు చుసిన చూడాలనిపిస్తాయి , వాళ్ళ మాటలు, కథలు ఎప్పటికి బోర్ కొట్టవ్ వాటితో పాటు ఈ సినిమా లో తల్లితండ్రులు , నేటి సమాజం చూసి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.
ప్రస్తుత విద్యావ్యవస్థ , దానిలో లోటుపాట్లు , ఎలా సాగితే పిల్లలకు ఉపయోగం అని ఈ చిత్రం క్లియర్ గా చెప్తుంది.
ఈ చిత్రం లో అంతర్లీనంగా మంచి మెసేజ్ ఉంది కానీ దర్శకుడు ఎక్కడ కూడా క్లాస్ పీకుతున్నట్టు ఉండదు ఎందుకంటే కధనంలో వినోదానికి ఢోకా లేకుండా చూసుకోడం వల్లనే
ఈ సినిమా లోని ముఖ్య పాత్రలని మనం చాలా తొందరగా రిలేట్ చేసుకుంటాం, అర్ధవంతమైన సంభాషణలు , అందరూ మనసు పెట్టి పనిచేయడం ఈ సినిమాకి ఉన్న ప్రధాన బలం
పిల్లల చిన్నతనంలోనే ఏదైనా అంశం మీద వ్యతిరేకం లేదా అనుమానం బలపడితే దాన్ని మార్చలేం. మార్చడం కూడా అంత తేలిక కాదు అని చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం & దర్శకుడు ఆ విషయం లో 100 /100 శాతం విజయం సాధించాడు.
Read Also : కల్కి 2898 ఏడీ మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం
నటీనటుల పనితీరు
మంచి కథకి, మంచి పాత్ర కి మంచి నటీనటులు దొరికితే సినిమా ఎలా ఉంటాడో ఈ సినిమా ఒక నిదర్శనం
సరస్వతి పాత్రలో నివేదా ఎంత చక్కగా ఒదిగిపోయింది అని చెప్పడానికి మాటలు సరిపోవు
తన సొంత డబ్బింగ్ తో చిత్తూర్ యాస లో డైలాగ్స్ చెప్తూ, హావభావాలు పలకరిస్తుంటే, కొన్ని చోట్ల తెలీకుండానే కళ్ళు చెమర్చుతాయి. ఇంత మంచి నటిని తెలుగు దర్శకులు సరైన పాత్రలు ఇవ్వడంలేదేమో అని అనిపించకమానదు.
సరస్వతి భర్త గా తనకిచ్చిన పాత్రలో బాగా నటించాడు. ఇక చిన్న పిల్లాడి పాత్ర అరుణ్ గమ్మత్తుగా , అమాయకంగా బాగా చేసాడు. తెలుగు ఇండస్ట్రీ కి దొరికిన మంచి నటుడు ప్రియదర్శి అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈగోయ్స్టిక్ టీచర్ గా నెగటివ్ షేడ్స్ లో చక్కగా నటించాడు. మిగిలిన పాత్రలన్నీ సరిగ్గా ఒదిగిపోయాయి.
సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతం అందించాడు. సినిమా లో సందర్భానికి తగ్గట్టుగా వచ్చే ప్రతి పాత ఆణిముత్యమే. సినిమాటోగ్రఫీ కూడా కలర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమా ని నిర్మించడానికి ముందుకి వచ్చిన నిర్మాతలకి నిజంగా ధన్యవాదాలు.
దర్శకుడు నందకిషోర్ ఎంతో చక్కగా రాసుకున్న పాత్రలు, ఎమోషన్స్ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లగల దర్శకుడు
చివరగా
35 – ఇది నిజంగానే చిన్న కథ కాదు
Filmy Bowl Rating: 3.25/5
Follow us on Instagram