
Prabhas Fauji : ఫౌజి చిత్రం కోసం బాలీవుడ్ నుంచి మరో లెజెండ్ ని తీసుకొచ్చిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ.
‘బాహుబలి’ ,’సలార్’, ‘కల్కి’ సినిమాల సక్సెస్‌తో రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరికీ అందని రేంజ్ కి వెళ్ళాడు. ఇప్పుడు పాన్ ఇండియా ,పాన్ వరల్డ్ సినిమాలు తప్పితే చిన్న కథలు తన దగ్గరకి వచ్చే స్థితి లేదు.
అదే లెక్కన ప్రభాస్ కూడా నెక్స్ట్ లెవెల్ లైన్ అప్ తో ఫ్యాన్స్ ని హ్యాపీ గా ఉంచుతున్నాడు ఈ క్రమం లోనే సీతారామం చిత్రంతో తనకంటూ నేషనల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న మంచి అభిరుచి గల దర్శకుడు హను రాఘవాపుడితో ఓ సినిమా చేయడం ఫ్యాన్స్‌కి మరింత కిక్కునిచ్చింది. పైగా ఈ సినిమా యుద్ధ నేపధ్యం లో జరిగే ప్రేమ కథ హను ప్రేమ కధలు ఎంత చక్కగా డీల్ చేస్తాడో కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు.
ఫౌజి వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయిల్ తో పాటు పాత తరం అందాల నటి జయప్రద నటించనుడటంతో సినీవర్గాలల్లో , అభిమానుల్లో సినిమా పై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.

Read Also : దేవర డే 4 కలెక్షన్స్ – స్టడీ గానే ఉన్నాయి
ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో లెజెండ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
ఆయనే తాజాగా భారతదేశ చలన చిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ పొందిన మిధున్ చక్రవర్తి.
ప్రభాస్ సినిమా లో కేవలం హైప్ కోసం లెజెండరీ యాక్టర్స్ ని తీసుకోరని వాళ్ళకంటూ గొప్ప పాత్రలు ఉంటాయని కల్కి తో ప్రూవ్ అవ్వడం తో ఆ లెజెండరీ యాక్టర్స్ కూడా నటించడానికి ఒప్పుకుంటున్నారు
గతంలో ‘గోపాల గోపాల’ చిత్రంలో నెగిటివ్ పాత్ర తో తన నటనను తెలుగు ప్రజలకు పరిచయం చేసారు మిథున్.
కాగా ఫౌజి సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
Follow us on Instagram