Viswak sen Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/viswak-sen/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 19 Mar 2025 08:17:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Viswak sen Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/viswak-sen/ 32 32 ఈ నగరానికి ఏమైంది : క్రేజీ మూవీకి సీక్వెల్.. ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/what-happened-to-this-city-a-sequel-to-the-crazy-movie-a-feast-for-fans/ https://filmybowl.com/what-happened-to-this-city-a-sequel-to-the-crazy-movie-a-feast-for-fans/#respond Wed, 19 Mar 2025 08:17:20 +0000 https://filmybowl.com/telugu/?p=3204 టాలీవుడ్ క్రేజీ మూవీ “ ఈ నగరానికి ఏమైంది “ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..యంగ్ హీరో విశ్వక్ సేన్ లీడ్​ రోల్​లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ మూవీ ఇది.. సింపుల్ స్టోరీతో యూత్​ ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది..ఫుల్ ఎంటర్​టైనింగ్​గా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా నచ్చింది.. అయితే ఈ చిత్రం రిలీజ్ అయిన ప్రారంభంలో టార్గెట్ ఆడియెన్స్ కి...

The post ఈ నగరానికి ఏమైంది : క్రేజీ మూవీకి సీక్వెల్.. ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ క్రేజీ మూవీ “ ఈ నగరానికి ఏమైంది “ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..యంగ్ హీరో విశ్వక్ సేన్ లీడ్​ రోల్​లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ మూవీ ఇది.. సింపుల్ స్టోరీతో యూత్​ ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది..ఫుల్ ఎంటర్​టైనింగ్​గా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా నచ్చింది.. అయితే ఈ చిత్రం రిలీజ్ అయిన ప్రారంభంలో టార్గెట్ ఆడియెన్స్ కి పెద్దగా కనెక్ట్ కానప్పటికీ, మీమ్స్ వల్ల ఈ సినిమా నెట్టింట ఎంతో పాపులర్ అయ్యింది.

కల్కి సెకండ్ పార్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్​ను రూపొందించేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్​ కూడా మొదలు కానున్నట్లు సమాచారం. ’35 చిన్న కథ కాదు’ చిత్రాన్ని నిర్మించిన ఎస్ ఒరిజినల్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనుందని తెలుస్తుంది.. ‘పెళ్లి చూపులు’ వంటి సూపర్ సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన రెండవ సినిమా ఇది..ఈ సినిమాలో విశ్వక్ సేన్తో పాటు అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను, సాయి సుశాంత్ కముఖ్య పాత్రల్లో నటించారు..నలుగురు స్నేహితుల జీవితాల్లో జరిగిన ఘటనలు అలాగే కాలేజీ లైఫ్ గురించి ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించారు.రీసెంట్గా ఈ సినిమా రీరిలీజ్ చేయగా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి..

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ఈ సంవత్సరమే మొదలు పెడుతున్నట్లు తరుణ్ భాస్కర్ ప్రకటించారు..ఈ మేరకు ఇన్ స్టా లో ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలని పోస్ట్ చేసారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది..ఈ సినిమా సీక్వెల్ లో ఫస్ట్ పార్ట్ బ్యాచ్ తోనే తీస్తారా.. లేదా ఫ్రెష్ గ్యాంగ్ ని సెలెక్ట్ చేస్తారా అనేది తెలియాల్సి వుంది..

 

The post ఈ నగరానికి ఏమైంది : క్రేజీ మూవీకి సీక్వెల్.. ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/what-happened-to-this-city-a-sequel-to-the-crazy-movie-a-feast-for-fans/feed/ 0
లైలా ఎఫెక్ట్.. అసభ్యత జోలికి పోనంటున్న విశ్వక్ సేన్..!! https://filmybowl.com/laila-effect-vishwak-sen-says-he-will-not-indulge-in-vulgarity/ https://filmybowl.com/laila-effect-vishwak-sen-says-he-will-not-indulge-in-vulgarity/#respond Thu, 20 Feb 2025 13:49:25 +0000 https://filmybowl.com/telugu/?p=2718 మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేసే సినిమాలు ఎక్కువగా యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్లు ఉంటుంది.. ప్రతీ సినిమాలో విభిన్న పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం విశ్వక్ సేన్ అలవాటు.. తన అద్భుతమైన నటనతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు.. అయితే ఇటీవల విశ్వక్ సేన్ నటించిన “లైలా” సినిమా ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో...

The post లైలా ఎఫెక్ట్.. అసభ్యత జోలికి పోనంటున్న విశ్వక్ సేన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేసే సినిమాలు ఎక్కువగా యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్లు ఉంటుంది.. ప్రతీ సినిమాలో విభిన్న పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం విశ్వక్ సేన్ అలవాటు.. తన అద్భుతమైన నటనతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు.. అయితే ఇటీవల విశ్వక్ సేన్ నటించిన “లైలా” సినిమా ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే లైలా సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది..లైలా సినిమాలో విశ్వక్ మొదటిసారి లేడీ గెటప్ లో నటించాడు.. అయితే ఈ సినిమాలో అసభ్యత సీన్స్, డైలాగ్స్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులకి చిరాకు తెప్పించింది.. దీనితో విశ్వక్ సేన్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది..

NTR-NEEL : ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం.. ఓపెనింగ్ షాట్ అదిరిందిగా..!!

అయితే తాజాగా లైలా సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ఆ సినిమా గురించి విశ్వక్ సేన్ రెస్పాండ్ అయ్యాడు..ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశాడు. నమస్తే, ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇక పై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు మీకు పూర్తిగా ఉంది.

ఎందుకంటే నా ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు.నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగానో ప్రేమించారు.. ఇక పై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను.త్వరలోనే మరొక బలమైన కథతో మీ ముందుకు వస్తాను అని విశ్వక్ రాసుకొచ్చాడు

The post లైలా ఎఫెక్ట్.. అసభ్యత జోలికి పోనంటున్న విశ్వక్ సేన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/laila-effect-vishwak-sen-says-he-will-not-indulge-in-vulgarity/feed/ 0
సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లైలా’.. రన్ టైం ఎంతంటే..? https://filmybowl.com/vishwak-sens-laila-has-completed-censoring-what-is-the-run-time/ https://filmybowl.com/vishwak-sens-laila-has-completed-censoring-what-is-the-run-time/#respond Wed, 12 Feb 2025 09:12:53 +0000 https://filmybowl.com/telugu/?p=2549 టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ పెర్ఫార్మన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో గత కొంత కాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. అయితే తన కెరీర్ ని టర్న్ చేసే సాలిడ్ హిట్ మాత్రం విశ్వక్ కి లభించలేదు.. ప్రస్తుతం విశ్వక్ సేన్ నటించిన యూనిక్ రొమాంటిక్ యాక్షన్...

The post సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లైలా’.. రన్ టైం ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ పెర్ఫార్మన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో గత కొంత కాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. అయితే తన కెరీర్ ని టర్న్ చేసే సాలిడ్ హిట్ మాత్రం విశ్వక్ కి లభించలేదు.. ప్రస్తుతం విశ్వక్ సేన్ నటించిన యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’ విడుదలకు సిద్ధం అయింది… రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మించారు.విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది.

ఆర్జివీ డెన్ నుంచి మరో కళాఖండం.. ఇంట్రెస్టింగ్ గా ‘శారీ’ ట్రైలర్..!!

విశ్వక్ సేన్ మొదటి సారి లేడీ గెటప్ లో అదరగొట్టాడు.ఈ సినిమాను వాలంటైన్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషనల్ ఈవెంట్స్ జోరుగా నిర్వహిస్తుంది… ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి అయ్యాయి..తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది.ఇందులో బోల్డ్ డైలాగ్స్, కొన్ని రొమాంటిక్ సీన్స్ కారణంగా ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 16 నిమిషాలుగా మేకర్స్ ఫిక్స్ చేశారు..

క్రిస్పీ రన్‌టైమ్‌తో రానున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా లేడీ గెటప్‌లో విశ్వక్ సెన్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు అందుతున్నాయి.ఇప్పటికే తన లుక్ తో సినిమాపై అంచానాలు పెంచేసిన ఈ యంగ్ హీరో ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పిస్తాడో చూడాలి..

 

The post సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లైలా’.. రన్ టైం ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/vishwak-sens-laila-has-completed-censoring-what-is-the-run-time/feed/ 0
ఇండస్ట్రీ అంతా ఒక్కటే.. స్టార్స్ కి కాంపౌండ్స్ లేవు.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/the-entire-industry-is-one-stars-dont-have-compounds-megastars-interesting-comments/ https://filmybowl.com/the-entire-industry-is-one-stars-dont-have-compounds-megastars-interesting-comments/#respond Mon, 10 Feb 2025 11:56:53 +0000 https://filmybowl.com/telugu/?p=2514 మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’.. రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది.. ‘లైలా’ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్...

The post ఇండస్ట్రీ అంతా ఒక్కటే.. స్టార్స్ కి కాంపౌండ్స్ లేవు.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’.. రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది.. ‘లైలా’ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ మొదటి సారి లేడీ గెటప్ లో కనిపించాడు.. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే విశ్వక్ సేన్ గత సినిమాలను గమనిస్తే తన సినిమాలను ప్రేక్షకులకు చేరువయ్యేలా డిఫరెంట్ గా ప్రమోట్ చేయడం తన అలవాటు.అలాగే తన సినిమా ఈవెంట్స్ కి స్టార్ హీరోస్ కచ్చితంగా వస్తారు.. అది కూడా మాక్సిమమ్ నందమూరి కాంపౌండ్ నుంచే రావడం జరుగుతుంది…

ఓటీటీ కంటే ముందుగా టీవీల్లోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!!

విశ్వక్ సేన్ కు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయిన విశ్వక్ సేన్ చేసే హంగామా మాములుగా ఉండదు… అలాగే బాలయ్య అంటే విశ్వక్ కు ఎంతో అభిమానం.. బాలయ్య కూడా విశ్వక్ పై ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటాడు.. అయితే ఎప్పుడూ నందమూరి హీరోలతో తన సినిమాలను ప్రమోట్ చేయించుకునే విశ్వక్ తాజాగా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా  మెగాస్టార్ చిరంజీవి ని ఇన్వైట్ చేసాడు..ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన మెగాస్టార్ సినీ నటుల ఫ్యాన్స్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోలంతా ఒక్కటే.. ఒకరితో ఒకరు అంతా బాగానే వుంటారు..కానీ ఫ్యాన్స్ మాత్రం ఒకరి ఫ్యాన్స్ పై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు అని చిరంజీవి అన్నారు.

బాలకృష్ణ ఫ్యాన్ సినిమా అయితే నేను రాకూడదా.. అని చిరంజీవి షూటిగా ప్రశ్నించారు. ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్ అని చిరంజీవి తెలిపారు.విశ్వక్ సేన్ ఫంక్షన్‌కి నువ్వు వెళ్తున్నావా.. అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ కాంపౌండ్.. అప్పుడప్పుడు తారక్ కూడా అంటూ ఉంటాడు అని నాకు ఇక్కడికి వచ్చే ముందు కొన్ని మాటలు వినిపించాయి.. అలాంటి వారికీ నేనొకటే చెబుతా.. మనిషి అన్నాక వేరే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది.. అలాగే నా మీద ఆప్యాయత కూడా ఉంటుంది..అంతెందుకు మా అబ్బాయి రాంచరణ్ కు సూర్య అంటే చాలా ఇష్టం..నేను చరణ్ ఫంక్షన్స్ కి వెళ్లకుండా ఉంటానా ఇలాంటి ఫంక్షన్స్ కు వస్తే నాకు చాలా ఎనర్జీ వస్తుందని మెగాస్టార్ అన్నారు..

 

The post ఇండస్ట్రీ అంతా ఒక్కటే.. స్టార్స్ కి కాంపౌండ్స్ లేవు.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-entire-industry-is-one-stars-dont-have-compounds-megastars-interesting-comments/feed/ 0