Vikki koushal Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/vikki-koushal/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 22 Feb 2025 08:43:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Vikki koushal Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/vikki-koushal/ 32 32 “ఛావా” కోసం రంగంలోకి ఎన్టీఆర్..ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/ntr-enters-the-field-for-chavaa-now-fans-are-in-for-a-treat/ https://filmybowl.com/ntr-enters-the-field-for-chavaa-now-fans-are-in-for-a-treat/#respond Sat, 22 Feb 2025 08:40:25 +0000 https://filmybowl.com/telugu/?p=2754 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ప్రెజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోలలో నటన పరంగా పర్ఫెక్షన్ వున్న యాక్టర్ గా ఎన్టీఆర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..డాన్స్ లో కానీ డైలాగ్ డెలివరీలో గానీ ఎన్టీఆర్ ఇతర స్టార్ హీరోలను బీట్ చేస్తున్నాడు… ముఖ్యంగా ఎన్టీఆర్ బేస్ వాయిస్ కి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు… ఆ బేస్ వాయిస్ తో ఎన్టీఆర్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్...

The post “ఛావా” కోసం రంగంలోకి ఎన్టీఆర్..ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ప్రెజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోలలో నటన పరంగా పర్ఫెక్షన్ వున్న యాక్టర్ గా ఎన్టీఆర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..డాన్స్ లో కానీ డైలాగ్ డెలివరీలో గానీ ఎన్టీఆర్ ఇతర స్టార్ హీరోలను బీట్ చేస్తున్నాడు… ముఖ్యంగా ఎన్టీఆర్ బేస్ వాయిస్ కి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు… ఆ బేస్ వాయిస్ తో ఎన్టీఆర్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి.. అయితే ఎన్టీఆర్ ఈమధ్య కాలంలో తన సినిమాలతో పాటుగా ఇతర హీరోల సినిమాలకి కూడా వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు..ఇటీవల రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కింగ్డమ్” టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు.. ప్రస్తుతం ఆ టీజర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది..

హీరోగా, దర్శకుడిగా..అన్ని ఫార్మాట్స్ లో అదరగొడుతున్న ధనుష్..

దర్శకధీరుడు రాజమౌళి తెకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా గ్లోబల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేశాడు.. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఏకంగా రూ.550 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ -2’ అనే సినిమా చేస్తున్నాడు..ఆ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నాడు..ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ కూడా ఎన్టీఆర్ కంప్లీట్ చేసుకున్నారు.అలాగే కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు..ఇటీవల ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఎన్టీఆర్ త్వరలో ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు..ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ‘ఛావా’ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది.

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “ఛావా” సినిమా ఫిబ్రవరి 14వ తేదీన బాలీవుడ్లో విడుదలైంది..నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ భార్యగా నటించింది. లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్రలో చాలా అద్భుతంగా నటించారు.విక్కీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే విక్కీ కౌశల్ పాత్రకి ఎన్టీఆర్ వాయిస్ అందించబోతున్నారని సమాచారం..ఒకవేళ ఇదే కనుక నిజమైతే థియేటర్లు షేక్ అవుతాయి..

 

The post “ఛావా” కోసం రంగంలోకి ఎన్టీఆర్..ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntr-enters-the-field-for-chavaa-now-fans-are-in-for-a-treat/feed/ 0