#sensational tweet Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/sensational-tweet/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 22 Jan 2025 13:25:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #sensational tweet Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/sensational-tweet/ 32 32 ఈ ఒక్క సినిమాతో నా పాపాన్ని కడిగేసుకుంటా.. ఆర్జివీ సంచలన ట్వీట్ వైరల్..!! https://filmybowl.com/i-will-wash-away-my-sins-with-this-one-movie-rgvs-sensational-tweet-goes-viral/ https://filmybowl.com/i-will-wash-away-my-sins-with-this-one-movie-rgvs-sensational-tweet-goes-viral/#respond Wed, 22 Jan 2025 13:24:42 +0000 https://filmybowl.com/telugu/?p=2167 సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ గతంలో తెరకెక్కించిన చాలా సినిమాలు కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయాయి.. గతంలో ఆర్జీవీ టేకింగ్ అంటే ఇష్టపడని వారు వుండరు.ఎవరికి సాధ్యం కాని విధంగా ఆర్జివీ తనదైనా శైలిలో అద్భుతంగా సినిమాలు తెరకెక్కించాడు.. అయితే ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు ఆర్జివీ అంటే ఏ గ్రేడ్ సినిమాలు చేసుకునే దర్శకుడు అని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం గత కొన్నేళ్లుగా ఆర్జివీ మద్యానికి బానిస...

The post ఈ ఒక్క సినిమాతో నా పాపాన్ని కడిగేసుకుంటా.. ఆర్జివీ సంచలన ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ గతంలో తెరకెక్కించిన చాలా సినిమాలు కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయాయి.. గతంలో ఆర్జీవీ టేకింగ్ అంటే ఇష్టపడని వారు వుండరు.ఎవరికి సాధ్యం కాని విధంగా ఆర్జివీ తనదైనా శైలిలో అద్భుతంగా సినిమాలు తెరకెక్కించాడు.. అయితే ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు ఆర్జివీ అంటే ఏ గ్రేడ్ సినిమాలు చేసుకునే దర్శకుడు అని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం గత కొన్నేళ్లుగా ఆర్జివీ మద్యానికి బానిస అయి తనకి అనిపించిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు..తనలో వున్న అద్భుత టాలెంట్ ని పక్కన పెట్టి జీవితంలో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాడు..అయితే ఆర్జీవీ తీసిన బెస్ట్ సినిమాల్లో ఒకటైన సత్య సినిమాని ఇటీవల రీ రిలీజ్ చేసారు.దీనికి ముంబైలో స్పెషల్ షో వేయడంతో ఆర్జీవీతో పాటు ఆ సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ వచ్చారు.సత్య సినిమా చూసిన తర్వాత ఆర్జీవీ తన సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసారు…. సత్య సినిమా మళ్ళీ చూసి నేను ఏడ్చాను. అప్పట్లో ఉన్న నిజాయితీ, నిబద్దత ఇప్పుడు నాలో అస్సలు లేవు. ఇలాంటి మంచి సినిమాలు తీసిన నేను ఆ తరువాత అహంకారంతో ఏవేవో సినిమాలు తీసాను. సత్య సినిమా ఇప్పుడు నాలో మార్పు తెచ్చింది. ఇకపై నా జీవితాంతం మంచి సినిమాలు తీయడానికే ప్రయత్నిస్తానని ప్రామిస్ చేసారు…

ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సత్య సినిమా రేంజ్ లో కాకపోయినా నిజాయితిగా నా టాలెంట్ అంతా ఉపయోగించి ఓ మంచి సినిమా కచ్చితంగా తీస్తాను అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు. ఇన్నేళ్లకు ఆర్జీవీ ఎమోషనల్ గా ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది..మళ్ళీ వింటేజ్ ఆర్జీవీ కంబ్యాక్ ఇస్తాడా? ఇస్తే ఎలాంటి సినిమా తీస్తాడు? ఆర్జీవీ నెక్స్ట్ సినిమా ఏంటి అంటూ ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. తాజాగా ఆర్జీవీ తన నెక్స్ట్ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ, ఆ సినిమా కథ మెయిన్ పాయింట్ కూడా చెప్తూ ట్వీట్ చేసాడు.ఆర్జీవీ తన ట్వీట్ లో.. ఒక మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు. సత్య సినిమాపై నా కన్ఫెషన్ నోట్‌కు కొనసాగింపుగా నేను ఎప్పటికైనా పెద్ద సినిమాని తీయాలనినిర్ణయించుకున్నాను. ఆ సినిమా పేరు ‘సిండికేట్’. ఇది భారతదేశ అస్తిత్వానికే ముప్పు కలిగించే ఓ భయంకరమైన సంస్థ. దీని కాన్సెప్ట్ ఏంటంటే.. స్ట్రీట్ గ్యాంగ్‌లు, రాజకీయ పార్టీలు, స్మగ్లింగ్లు, కార్పొరేట్ ముఠాలు, D కంపెనీ.. ఇలాంటివి దేశంలోని ఆర్ధిక సంస్కరణలు తీవ్రంగా నాశనం చేసాయి. ఆ తర్వాత భయంకరమైన ISIS, ఘోరమైన అల్ఖైదాతో ఉగ్రవాదం కూడా పెరిగింది.

కానీ గత 10 నుండి 15 సంవత్సరాల మధ్యలో భారతదేశంలో చెప్పుకోదగ్గ నేర సంస్థ ఏదీ కూడా లేదు. ప్రస్తుతం వివిధ దేశాల మధ్య ఉన్న గొడవలతో ఓ కొత్త రకమైన నేర సంస్థ పుట్టే సమయం ఆసన్నమైందని. ఇది గతంలోని సంస్థలకు భిన్నంగా పోలీసింగ్ ఏజెన్సీలు, రాజకీయాలు, రిచ్ బిజినెస్ మెన్స్, మిలిటరీతో సహా పలువురు కలిసి ఒక సిండికేట్‌గా మారింది. సిండికేట్ అనేది ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ తెలీదు. అంటూ ఆర్జివీ ట్వీట్ చేసారు..ఈ సిండికేట్ అనే ఈ ఒక్క సినిమాతో గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసిన పాపాలన్నింటినీ కడిగేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. ఈ సినిమా క్యాస్ట్,మిగిలిన డీటెయిల్స్ త్వరలోనే ప్రకటిస్తానని ఆర్జివీ తెలిపారు.

The post ఈ ఒక్క సినిమాతో నా పాపాన్ని కడిగేసుకుంటా.. ఆర్జివీ సంచలన ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/i-will-wash-away-my-sins-with-this-one-movie-rgvs-sensational-tweet-goes-viral/feed/ 0
జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/i-made-an-unforgivable-mistake-in-life-rgvs-sensational-post-went-viral/ https://filmybowl.com/i-made-an-unforgivable-mistake-in-life-rgvs-sensational-post-went-viral/#respond Tue, 21 Jan 2025 10:47:30 +0000 https://filmybowl.com/telugu/?p=2144 టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అప్పట్లో ఆయన నుంచి సినిమా వచ్చిందంటే యూత్ అంతా థియేటర్స్ కి క్యూ కట్టేవారు.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఆర్జివీ తెరకెక్కించే మూవీ ట్రెండ్ సెట్ చేసాయి.. ఆయన తెరకెక్కించిన “శివ” మూవీ.. నాగార్జున కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.. శివ సినిమాతో నాగార్జున కెరీర్ ఒక్కసారిగా టర్న్...

The post జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అప్పట్లో ఆయన నుంచి సినిమా వచ్చిందంటే యూత్ అంతా థియేటర్స్ కి క్యూ కట్టేవారు.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఆర్జివీ తెరకెక్కించే మూవీ ట్రెండ్ సెట్ చేసాయి.. ఆయన తెరకెక్కించిన “శివ” మూవీ.. నాగార్జున కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.. శివ సినిమాతో నాగార్జున కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది.. అంత గొప్ప సినిమా ఇచ్చిన ఆర్జివీ ఆ తరువాత సత్య, క్షణ క్షణం, రంగీలా, గోవిందా గోవిందా వంటి అద్భుతమైన సినిమాలు తెరకెక్కించాడు..అప్పట్లో తన సినిమాలతో సెపెరేట్ బ్రాండ్ క్రియేట్ చేసిన ఆర్జీవీ ఇప్పుడు బూతు  సినిమాలు తీసే దర్శకుడుగా మారాడు..అందుకు తన జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని తెలియజేస్తూ ఆర్జీవీ తాజాగా ఎక్స్ ఖాతాలో సంచలన పోస్ట్ చేసాడు.

ఫౌజీ : ఊహించని పాత్రలో ప్రభాస్..హనురాఘవపూడి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

ఆర్జీవీ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా ‘సత్య’. దాదాపు 27 ఏళ్ల కిత్రం విడుదలైన ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు… ఇటీవల ఈ సినిమా రీరిలీజ్ అయిన నేపథ్యంలో ఈ సినిమాను చూసిన ఆర్జీవీ ఈ విధంగా రాసుకొచ్చాడు.దాదాపు 27 సంవత్సరాల తర్వాత మొదటిసారి రెండు రోజుల క్రితం నేను తెరకెక్కించిన సత్య సినిమా చూసాను. చూస్తున్నంత సేపు నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు తలుచుకుంటే నా కంటిలో కన్నీళ్లు ఆగలేదు. సినిమా తీయడం అంటే పసి బిడ్డకు జన్మనివ్వడం లాంటిది. పురిటిలో బిడ్డ ఎలా పురుడుపోసుకుంటుందో సినిమా కూడా అంతే. సినిమా హిట్ అయినా కాకున్నా నేను ముందుకు సాగుతూ వచ్చాను.

2 రోజుల క్రితం సత్య సినిమా చూసి హోటల్‌కు తిరిగి వచ్చి చీకటిలో కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఇంత గొప్ప జానర్‌ సినిమాను నేనే తీశాను అనే ఆనందంలో నాకు కన్నీళ్లు వచ్చాయి..’సత్య’ లాంటి గొప్ప సినిమా చూసి నాపై ఎంతోమంది పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయను అనిపించి తెగ ఏడ్చేసాను.ఈ సినిమాను నేను బెంచ్‌మార్క్‌గా ఎందుకు పెట్టుకోలేదని నాకు అనిపించింది.రంగీలా, సత్య వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాక ఆ గర్వంతో నా కళ్లు మూసుకుపోయాయి. ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీశా. ఆ రెండు సినిమాలు ఇచ్చిన విజయం, అహంకారం, పొగరుతో నా కళ్లునెత్తికెక్కాయి. మద్యానికి బానిసై తాగుబోతుగా మారాను. సత్య’ గొప్పతనం రెండు రోజుల ముందు దాన్ని మరోసారి చూసేవరకూ నాకు అర్థం కాలేదు. సత్య కారణంగా నన్ను నమ్మిన వారందరికీ నేను చేసిన ద్రోహాలకు నేను ఎంతో  భాదపడ్డానని  ఆర్జివీ ఎంతో ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసారు…చివరగా ఇప్పుడు నా జీవితంలో మిగిలి ఉన్న ఈ కొంత సమయాన్ని సత్య వంటి మంచి సినిమాలు చేయడానికి ఉపయోగిస్తా అని.. ఈ సత్యాన్ని నేను ‘సత్య’ పై ప్రమాణంచేస్తూ చెబుతున్నాను’ అని ఆర్జివీ సంచలన పోస్ట్ చేసారు..

The post జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/i-made-an-unforgivable-mistake-in-life-rgvs-sensational-post-went-viral/feed/ 0
ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. అల్లుఅర్జున్ ట్వీట్ వైరల్..!! https://filmybowl.com/hot-stampede-controversy-alluarjuns-tweet-viral/ https://filmybowl.com/hot-stampede-controversy-alluarjuns-tweet-viral/#respond Sun, 22 Dec 2024 13:30:08 +0000 https://filmybowl.com/telugu/?p=1564 పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ కి ఆ సినిమా రిలీజ్ రోజు నుంచి అస్సలు మనస్శాంతి లేదు.. ఫ్యాన్స్ తో సినిమా ఎంజాయ్ చేయాలనీ సంధ్య థియేటర్ కి వెళ్లిన అల్లుఅర్జున్ ని తొక్కిసలాట ఘటన చిక్కుల్లో పడేసింది.. అసలు ఆరోజు సినిమాకు వెళ్ళకపోయివుంటే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ ని ఫ్యాన్స్ తో బాగా ఎంజాయ్ చేసేవాడు.. కానీ ఆ ఘటన...

The post ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. అల్లుఅర్జున్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ కి ఆ సినిమా రిలీజ్ రోజు నుంచి అస్సలు మనస్శాంతి లేదు.. ఫ్యాన్స్ తో సినిమా ఎంజాయ్ చేయాలనీ సంధ్య థియేటర్ కి వెళ్లిన అల్లుఅర్జున్ ని తొక్కిసలాట ఘటన చిక్కుల్లో పడేసింది.. అసలు ఆరోజు సినిమాకు వెళ్ళకపోయివుంటే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ ని ఫ్యాన్స్ తో బాగా ఎంజాయ్ చేసేవాడు.. కానీ ఆ ఘటన అల్లుఅర్జున్ జీవితంలో మాయని మచ్చలా నిలిచింది..

శ్రీ తేజ్ ని పరామర్శించా..కానీ పబ్లిసిటీ చేసుకోలేదు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్..!!

ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా వున్నారు.. అల్లుఅర్జున్ చేసింది తప్పు అంటూ ఏకంగా అసెంబ్లీలోనే దుయ్యబట్టారు.. అల్లుఅర్జున్ ని సపోర్ట్ చేసినందుకు సినిమా స్టార్స్ పై కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు..రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది.. అల్లుఅర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతూ ఈ ఇష్యూ ని మరింత సీరియస్ చేస్తున్నారు.. దీనికి ఎలాగైనా ఎండ్ కార్డ్ వేయాలని అల్లుఅర్జున్ డిసైడ్ అయ్యారు..తన అభిమానుల కోసం ఎక్స్ ద్వారా ఒక మెసేజ్ పంపించారు. తన అభిమానులు తమ అభిప్రాయాలను బాధ్యాతాయుతంగా చెప్పాలని ఆయన అన్నారు.

ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని వారిని సూచించారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్‌తో, ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని తెలిపారు..వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అల్లు అర్జున్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేసారు…నెగటివ్ పోస్టులు పెడుతున్న వారికి తన అభిమానులు దూరంగా ఉండాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని కోరారు.ఎవ్వరిపైనా దుర్భాషలకు దిగరాదని అల్లు అర్జున్ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ ఈ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది…

The post ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. అల్లుఅర్జున్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/hot-stampede-controversy-alluarjuns-tweet-viral/feed/ 0