#release date Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/release-date/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 22 Mar 2025 14:19:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #release date Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/release-date/ 32 32 ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/toxic-release-date-fixed-special-poster-is-a-hit/ https://filmybowl.com/toxic-release-date-fixed-special-poster-is-a-hit/#respond Sat, 22 Mar 2025 14:19:49 +0000 https://filmybowl.com/telugu/?p=3253 కన్నడ స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సిరీస్ తో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 భారీ విజయం సాధించింది.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది.. కేజీఎఫ్ హిట్ కావడంతో తెలుగులో కన్నడ సినిమాలకు కూడా క్రేజ్ బాగా పెరిగింది.. కర్ణాటక గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా...

The post ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కన్నడ స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సిరీస్ తో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 భారీ విజయం సాధించింది.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది.. కేజీఎఫ్ హిట్ కావడంతో తెలుగులో కన్నడ సినిమాలకు కూడా క్రేజ్ బాగా పెరిగింది.. కర్ణాటక గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. చాప్టర్ 1 సృష్టించిన హిస్టరీని కేజీఎఫ్ చాప్టర్ 2 కొనసాగించింది.. కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఇంతటీ భారీ హిట్స్ అందుకున్న హీరో యశ్ తరువాత ఎలాంటి సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు..

అట్లీ మూవీలో అలాంటి పాత్రతో సర్ప్రైజ్ చేయనున్న అల్లుఅర్జున్..?

ఎంతో కాలంగా యష్ నెక్స్ట్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. తాజాగా వారి నిరీక్షణ ఫలించింది..గీతు మోహన్దాస్ డైరెక్షన్ లో యష్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్” ఈ సినిమాని మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై యశ్, వెంకట రమణ నిర్మిస్తున్నారు.. ఈ మూవీ కోసం మేకర్స్ వివిధ దేశాలకు చెందిన యాక్టర్లను, టెక్నిషియన్లను తీసుకున్నారు…ఈ సినిమాను ఇంగ్లిష్ భాషలో కూడా విడుదల చేస్తున్నారు.

ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీ ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. తాజాగా జె.జె. పెర్రీ ఈ సినిమాకు సంబందించి కీలక విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు… ఎంతో కష్టపడి యాక్షన్ సీన్స్ తెరకెక్కించామని, ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ భారీ స్థాయిలో ఉంటాయని ఇంతటి గొప్ప సినిమాలో పని చేయడం తనకి ఎంతో గర్వంగా ఉందని ఆయన తెలిపారు.ఈ సినిమాలో అమెరికన్ నటుడు కైల్ పాల్ కూడా నటించారు..ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయగా. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.యశ్ టాక్సిక్ సినిమా వచ్చే ఉగాదికి 2026 మార్చ్ 19 న రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ నేడు అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది..

 

The post ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/toxic-release-date-fixed-special-poster-is-a-hit/feed/ 0
పుష్ప 2 : వాయిదా పై క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ లో అదే భయం..అదే కన్ఫ్యూజన్..!! https://filmybowl.com/pushpa-2-even-if-clarity-is-given-on-postponement-same-fear-in-fans-same-confusion/ https://filmybowl.com/pushpa-2-even-if-clarity-is-given-on-postponement-same-fear-in-fans-same-confusion/#respond Fri, 22 Nov 2024 13:42:39 +0000 https://filmybowl.com/telugu/?p=1011 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2’’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారు.. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమా పుష్ప.. దీంతో పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో...

The post పుష్ప 2 : వాయిదా పై క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ లో అదే భయం..అదే కన్ఫ్యూజన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2’’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారు.. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమా పుష్ప.. దీంతో పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అల్లు అర్జున్ గత మూడు ఏళ్ల నుంచి పుష్పా 2 సినిమా కోసం తన డేట్స్ ని కేటాయించాడు.. గత మూడేళ్లుగా అల్లు అర్జున్ ని స్క్రీన్ పై చూడలేదు. దీనితో ఫ్యాన్స్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తుంది. రిలీజ్ డేట్ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది.

ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో విడుదల తేదీ వాయిదా పడింది. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తామని అప్పట్లో మేకర్స్ ప్రకటించారు.. కొంతకాలానికి డిసెంబర్ 6న కాదు డిసెంబర్ 5నే ఈ సినిమా వస్తుందని మేకర్స్ మళ్లీ ప్రకటించారు.. చెప్పిన దానికంటే ఒక రోజు ముందుగా వస్తుందని ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు.. కానీ ఆ తేదీన కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అనిపిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పాట్నాలో విడుదల చేయగా దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. కచ్చితంగా డిసెంబరు 5న సినిమా రాబోతోందని అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు.

నాగ చైతన్య నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..ఏకంగా అన్ని కోట్లా..?

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్స్ దర్శకుడు సుకుమార్ ఇంకా షూట్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవిశ్రీప్రసాద్ తో పాటు తమన్ ను అలాగే మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా తమన్ అందించిన బీజీఎం సుకుమార్ కు అంతగా నచ్చలేదు. దీంతో దగ్గరుండి మరీ తనకు కావల్సిన రీతిలో మరోసారి బీజీఎంను రాబట్టుకుంటున్నట్లు సమాచారం.. పుష్ప2 మొదటి భాగం వరకు మాత్రమే బీజీఎం, రీరికార్డింగ్ పని పూర్తవగా దీన్ని ఐమాక్స్ ఫార్మాట్ లోకి మార్చడానికి పంపించినట్లు తెలుస్తుంది..ఇంకా రెండో భాగానికి సంబంధించిన బీజీఎం, రీరికార్డింగ్ పని అలానే ఉంది. అంతేకాకుండా వీఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఆ విభాగం నుంచి పూర్తయిన సన్నివేశాలు ఇంకా రాలేదు. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 13 రోజులే మిగిలి వుంది.. ఈ 13 రోజుల్లో మిగిలిన షూటింగ్ భాగము  పనులన్నీ పూర్తి అవుతాయా అనేది సందేహంగా మారింది..

తమన్ ఇచ్చే మ్యూజిక్ సుకుమార్ కి నచ్చాలి ఆ మ్యూజిక్ ని ఆయన ఫైనల్ చేయాలి ఇదంతా కావడానికి కనీసం వారం రోజులైనా సమయం పడుతుంది అని సమాచారం.. దీంతో ఈ సినిమా మళ్లీ వాయిదా పడనుందని తెలుస్తుంది.. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 19 కి ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. హడావుడిగా రిలీజ్ చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని భావిస్తున్న నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది . వాయిదా వార్తలపై రీసెంట్ గా స్పందించిన మైత్రి మూవీ మేకర్స్ డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించింది. పుష్ప 2 పై వస్తున్న వరుస కథనాలతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.. మేకర్స్ ఈ విషయంపై వెంటనే స్పందించాలని కామెంట్స్ చేస్తున్నారు..

The post పుష్ప 2 : వాయిదా పై క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ లో అదే భయం..అదే కన్ఫ్యూజన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-even-if-clarity-is-given-on-postponement-same-fear-in-fans-same-confusion/feed/ 0