Rana naidu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/rana-naidu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 10 Apr 2025 11:31:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Rana naidu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/rana-naidu/ 32 32 రానా నాయుడు : సీజన్ 2 బిగ్ అప్డేట్.. గ్రాండ్ రిలీజ్ అప్పుడే..? https://filmybowl.com/rana-naidu-season-2-big-update-grand-release-just-then/ https://filmybowl.com/rana-naidu-season-2-big-update-grand-release-just-then/#respond Thu, 10 Apr 2025 11:31:03 +0000 https://filmybowl.com/telugu/?p=3555 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్,యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రానా కాంబోలో తెరకెక్కిన ‘రానానాయుడు’ వెబ్ సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2023 మార్చిలో రిలీజ్ అయిన బోల్డ్ వెబ్ సిరీస్.. అడల్ట్ డైలాగ్స్, సీన్స్ తో తెరకెక్కింది.. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ కి ఎన్నో విమర్శలు వచ్చాయి.ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు ఉన్న ఇమేజ్‌ను ఈ సిరీస్ బాగా...

The post రానా నాయుడు : సీజన్ 2 బిగ్ అప్డేట్.. గ్రాండ్ రిలీజ్ అప్పుడే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్,యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రానా కాంబోలో తెరకెక్కిన ‘రానానాయుడు’ వెబ్ సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2023 మార్చిలో రిలీజ్ అయిన బోల్డ్ వెబ్ సిరీస్.. అడల్ట్ డైలాగ్స్, సీన్స్ తో తెరకెక్కింది.. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ కి ఎన్నో విమర్శలు వచ్చాయి.ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు ఉన్న ఇమేజ్‌ను ఈ సిరీస్ బాగా డ్యామేజ్ చేసింది. దాంతో సెకండ్ సీజన్‌లో బోల్డ్‌నెస్ బాగా తగ్గించినట్లు సమాచారం. ఇక ‘రానా నాయుడు’ సీజన్ 2కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా రోజుల క్రితమే పూర్తయినట్లు తెలుస్తుంది.. తాజాగా సీజన్ 2 పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వైరల్ అవుతోంది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘జాక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

AA22: మరోసారి ఐకాన్ స్టార్ కి జోడిగా సమంత..?

కానీ ఆ వేడుకలో రానా దగ్గుబాటి కనిపించలేదు.రానా దగ్గుబాటి రాకపోవడం పై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చారు. రానా ముంబాయిలో ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌కు డబ్బింగ్ పనిలో ఉన్నాడని సిద్దూ తెలిపారు.తాజాగా వెంకటేష్‌తో పాటు రానా తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తి చేసే పనిలో వున్నారు..

మే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి చేసి జూన్‌లో ఈ వెబ్‌సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.. కాగా ఈ సీజన్ 2 సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది..ఈ సీజన్ 2లో వెంకటేష్‌, రానాతో పాటు అర్జున్ రాంపాల్‌, కృతి కర్భందా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రల్లో నటించారు.. ఈ బిగ్గెస్ట్ బోల్డ్ వెబ్‌సిరీస్‌ను కరణ్ అన్షుమాన్‌, సూపర్న్ వర్మ తెరకెక్కించారు..

 

The post రానా నాయుడు : సీజన్ 2 బిగ్ అప్డేట్.. గ్రాండ్ రిలీజ్ అప్పుడే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rana-naidu-season-2-big-update-grand-release-just-then/feed/ 0
రానా నాయుడు: సీజన్ 2 వచ్చేస్తుంది..టీజర్ తోనే హైప్ పెంచేసిన మేకర్స్..!! https://filmybowl.com/rana-naidu-season-2-is-coming-the-makers-have-increased-the-hype-with-the-teaser-itself/ https://filmybowl.com/rana-naidu-season-2-is-coming-the-makers-have-increased-the-hype-with-the-teaser-itself/#respond Mon, 03 Feb 2025 15:37:24 +0000 https://filmybowl.com/telugu/?p=2390 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఈ సంక్రాంతి పండుగకి “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. ఇదిలా ఉంటే గతంలో రానా దగ్గుబాటి,విక్టరీ వెంకటేష్ కలిసి ‘రానా నాయుడు’అనే బోల్డ్ వెబ్‌సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే…...

The post రానా నాయుడు: సీజన్ 2 వచ్చేస్తుంది..టీజర్ తోనే హైప్ పెంచేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఈ సంక్రాంతి పండుగకి “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. ఇదిలా ఉంటే గతంలో రానా దగ్గుబాటి,విక్టరీ వెంకటేష్ కలిసి ‘రానా నాయుడు’అనే బోల్డ్ వెబ్‌సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే… అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అయి రికార్డ్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే.

కన్నప్ప : ప్రభాస్ లుక్ పై సూపర్ ట్రోలింగ్..లుక్ కూడా కాపీనేనా..?

ఈ సిరీస్ లో వెంకీ, రానా తండ్రీ కొడుకులుగా నటించారు. అయితే ‘రానా నాయుడు’ సిరీస్ కు ఎంతటి క్రేజ్ వచ్చిందో అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి… ఇందులో వచ్చే కొన్ని సీన్స్ మరీ బోల్డ్‌గా ఉండటంతో దారుణంగా నెగటివ్ ట్రోలింగ్ జరిగింది.. ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఇంతటి చెత్త సిరీస్ లో నటించాడా అని చాలా మంది కామెంట్స్ చేసారు..

నెగటివ్ ట్రోలింగ్ ఎంత వచ్చినప్పటికి ‘రానా నాయుడు’ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపింది. అయితే మూవీ లవర్స్ అంతా ఈ సిరీస్‌కు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఇదిలా ఉంటే ఇటీవల ఈ బోల్డ్ సిరీస్ కి సీజన్-2 రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు.. ఇదిలా ఉంటే.. తాజాగా, నెట్‌ఫ్లిక్స్ సంస్థ రానా నాయుడు సిరీస్ లవర్స్ కి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘రానా నాయుడు-2’ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో విలన్‌గా నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తుండగా.. కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో సీజన్ 2 తెరకెక్కుతోంది. అయితేఈ టీజర్ మధ్యలో ‘కొన్ని యుద్ధాలు కొనసాగుతాయి.. కొత్తవి ప్రారంభమవుతాయి” అంటూ మేకర్స్ ‘రానా నాయుడు-2’ బాగా హైప్ పెంచారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు..

 

The post రానా నాయుడు: సీజన్ 2 వచ్చేస్తుంది..టీజర్ తోనే హైప్ పెంచేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rana-naidu-season-2-is-coming-the-makers-have-increased-the-hype-with-the-teaser-itself/feed/ 0