Movie reviews Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/movie-reviews/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 10 Oct 2024 16:09:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Movie reviews Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/movie-reviews/ 32 32 ‘వేట్టయాన్’ మూవీ రివ్యూ https://filmybowl.com/rajinikanth-vetteyian-movie-full-review/ https://filmybowl.com/rajinikanth-vetteyian-movie-full-review/#respond Thu, 10 Oct 2024 16:09:07 +0000 https://filmybowl.com/telugu/?p=692 Rajinikanth Vetteyian Movie Full review : టీజీ జ్ఞానవేల్ … తమిళ ఇండస్ట్రీ లో ‘జై భీమ్’తో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు. ఆయన దర్శకత్వం లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, రానా దగ్గుబాటి ఫహద్ ముఖ్య పాత్రల్లో రూపొందించిన చిత్రం వేట్టయాన్…. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం పదండి. తారాగణం:...

The post ‘వేట్టయాన్’ మూవీ రివ్యూ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Rajinikanth Vetteyian Movie Full review
Rajinikanth Vetteyian Movie Full review

Rajinikanth Vetteyian Movie Full review : టీజీ జ్ఞానవేల్ … తమిళ ఇండస్ట్రీ లో ‘జై భీమ్’తో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు. ఆయన దర్శకత్వం లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, రానా దగ్గుబాటి ఫహద్ ముఖ్య పాత్రల్లో రూపొందించిన చిత్రం వేట్టయాన్….

ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం పదండి.

తారాగణం: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ ,రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్, రావు రమేష్, కిషోర్, అభిరామి తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్
కెమెరా: ఎస్.ఆర్.కదిర్
నిర్మాత: సుభాస్కరన్
రచన- టీజీ జ్ఞానవేల్-కృత్తిక
దర్శకత్వం: టీజీ జ్ఞానవేల్

గత ఏడాది నెల్సన్ దర్శకత్వం లో ‘జైలర్’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి తన స్టామినా ప్రూవ్ చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ తర్వాత ఆయన కూతురు దర్శకత్వం లో ప్రత్యేక పాత్రలో నటించిన ‘లాల్ సలాం’ నిరాశపరిచింది. తదుపరి చిత్రం గా చేసిన మూవీ ‘వేట్టయాన్’.

కథ:
తమిళనాడులోని కన్యాకుమారిలో ఎస్పీగా పని చేస్తుంటాడు అథియన్ (రజినీకాంత్), ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా దేశంలోనే గొప్ప పేరుంటుంది అథియన్ కు. సమాజానికి హానికరమైన నేరస్థులను తనదైన శైలిలో ఏరి పారేస్తుంటాడు. చట్టం కంటే తనని తాను నమ్మే అథియన్ కు తాను చేసే ఎన్ కౌంటర్ల విషయంలో పశ్చాత్తాపం ఏమీ ఉండదు.

అథియన్ చేసిన ఒక స్మగ్లర్ ఎన్ కౌంటర్ కు శరణ్య అనే
ఉపాధ్యాయురాలు సహకరిస్తుంది. తర్వాత కొన్ని రోజులకే ఆ ఉపాధ్యాయురాలు దారుణ హత్యకు గురవుతుంది. ఆమెను చంపింది గుణ అనే వ్యక్తి అని తెలుసుకొని తగిన ఆధారాలను సేకరించి అతణ్ని ఎన్ కౌంటర్ చేస్తాడు అథియన్.

కానీ ఈ ఎన్ కౌంటర్ ని విచారించిన జడ్జి సత్యదేవ్ (అమితాబ్) ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి కొన్ని సంచలన విషయాలు బయటికి తీసి అథియన్ ముందు పెడతాడు. వాటిని తెలుసుకున్నాక తొలిసారి పశ్చాత్తాప పడే పరిస్థితి వస్తుంది..

ఇంతకీ సత్యదేవ్ వెలుగులోకి తెచ్చిన విషయాలేంటి.. దాని వల్ల అథియన్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.. చివరికి ఈ కేసు సంగతి ఏమైంది.. ఈ విషయాలన్నీ తెర మీదే చూడాలి.

Read Also : బాక్సులు బద్దలయ్యే అప్డేట్.. ఇక దబిడి దిబిడే!

కథనం-విశ్లేషణ:

కథ మీద నడిచే సినిమాలు కొన్ని ఉంటాయి
స్టార్లు మాత్రమే నడిపించగల కథలు కొన్ని ఉంటాయి.
స్టార్లు మాత్రమే చేయాల్సిన కథలూ కొన్ని ఉంటాయి.
ఇవన్నీ కాకుండా స్టార్లు ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి మామూలు కథల్లోనూ నటిస్తే వాటి రీచ్ ఎంత గా పెరుగుతుందో గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం l.

టీజీ జ్ఞానవేల్…. సూర్య లాంటి స్టార్ హీరో తో తన ఇమేజ్ ని పక్కన పెట్టించి మరి ‘జై భీమ్’ అనే ఓ గొప్ప కథలో నటింప చేసాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రీచ్ సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే .

ఆ ప్రయోగం బ్లాక్ బస్టర్ అవ్వడం తో తర్వాత సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ తోను అదే సామాజిక అంశాలతో ముడిపడ్డ ఓ మంచి కథనే చెప్పడానికి ప్రయత్నించాడు జ్ఞానవేల్.

ఐతే రజినీ ఇమేజ్ వేరు…
సూర్య ఇమేజ్ వేరు….
ఎంత వద్దనుకున్నా బయటికి రాలేని ఇమేజ్ ఛట్రం రజినీది. అందుకే కమర్షియల్ హంగులు జోడించక తప్పలేదు.

అలా కొంచెం పక్కకి వెళ్లి జోడించిన కమర్షియల్ హంగులు సినిమాలో సింక్ అవ్వలేదని అనుకోలేము. అలా అని అవి అదిరే లాగ ఉన్నాయి అని చెప్పలేం.

ఇక కథ గురించి మాట్లాడుకుంటే దర్శకుడు తీసుకున్న పాయింట్ మంచిదే. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ నడిచే థ్రిల్లర్ సినిమాలా ఆసక్తికరంగా నడిచే ‘వేట్టయాన్’ ఆపై సామాజిక అంశాల వైపు నడిపించాడు.. మరల కాసేపాగాక సాగదీసి క్లాస్ లు చెప్పడం తో.. చివరికి మామూలు సినిమాలా ముగుస్తుంది.

ఓ పోలీస్ అధికారి తాను నమ్మిన న్యాయానికి కట్టుబడి ఎన్ కౌంటర్లు చేస్తాడు. అవన్నీ పేరు కోసం చేసినవి కాదు. వాటి విషయంలో గర్వపడడు, పశ్చాత్తాపం పడడు

ప్రతి ఎన్ కౌంటర్ విషయంలో తనకి తాను సమాధానం చెప్పుకున్నాకే నేరస్థుల పని పడతాడు. అలాంటి అధికారి ఒక నిర్దోషి ని అన్యాయంగా చంపేస్తే? ఇదే ‘వేట్టయాన్’ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ‘వేట్టయాన్’ ప్రేక్షకులకు మంచి ఊపునిస్తుంది. అక్కడి వరకు సినిమా చాలా రేసీ గా నడుస్తుంది. ఆ తర్వాత ఆ వేగం లేకపోవడమే ‘వేట్టయాన్’ సమస్య.

మొదటి సగం వరకు ‘వేట్టయాన్’ మంచి రేసీ గా నడుస్తుంది. కథ ఎలా ఉన్నా రజినీ సినిమా అంటే విపరీతమైన బిల్డప్పులు.. ఎలివేషన్లు షాట్లు మామూలే. ఈ కథలో అవి అంతగా అతకక పోయినా.. కథ ని చెడగొట్టకుండా అభిమానులని నిరాశ పరచకుండా అక్కడక్కడా ఎలివేషన్లు ఇస్తూ.. బలంగానే కథను చెప్పాడు జ్ఞానవేల్.

ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా హీరో పాత్ర పరిచయానికి, ఎలేవేషన్స్ కి ఒక ఎపిసోడ్ ని డిజైన్ చేసి.. ఆ తర్వాత వెంటనే కథలోకి వెళ్లిపోయాడు. శరణ్య పాత్రతో సినిమా ని ఒక ఇంటెన్స్ మోడ్ వైపు నడిపించాడు. ఏ అమ్మాయి సాయంతో అయితే హీరో ఓ స్మగ్లర్ ను ఎన్ కౌంటర్ చేసాడో.. కానీ చివరికి ఆ అమ్మాయే చనిపోవడం.. దాన్ని పోలీసులు ఛేదించి హంతకుడిని చంపడం.. ఆ ఎన్కౌంటర్ లో తప్పులు జరగడం.. ఇలా ‘వేట్టయాన్’ చాలా చక్కగా ప్రేక్షకులని రంజింప చేస్తుంది. ఇంటర్వెల్ సమయానికి కథ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటది.

ఐతే ద్వితీయార్ధంలో ట్విస్ట్స్ అన్ని వీడే వరకు ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేసే ‘వేట్టయాన్’ ఆ తర్వాత సాధారణంగా మారిపోతుంది. అసలు విలన్ ఎవరో తెలిసిన దగ్గర్నుంచి కథను అతి సాధారణంగా తీసుకెళ్లాడు దర్శకుడు.

అప్పటిదాకా థ్రిల్లర్ స్టయిల్లో నడిచిన ‘వేట్టయాన్’ ఆ తర్వాత ఓ సామాజిక సమస్య చుట్టూ అక్కడే తిరుగుతూ బోర్ కొట్టిస్తుంది. దర్శకుడు తీసుకున్న సమస్య ముఖ్యమైందే అయినా.. ఈ ఫార్మాట్లో చాలా కథలు వచ్చేసి ఉండడం వళ్ళ ప్రేక్షకుడు డిస్కోనెక్ట అయిపోతాడు.

ఈ కథ రజినీ రేంజ్ కి చిన్నదిగా అనిపిస్తుంది. అమితాబ్ కూడా ఒక దశ దాటాక పెద్దగా చేసింది ఎం లేదు. మిగతా నటుల ప్రాధాన్యమూ తగ్గిపోయింది. సినిమా మొదలు పెట్టినప్పుడు నడిచిన తీరుకు.. చివరికి ముగిసిన తీరుకు పొంతన ఉండదు. జ్ఞానవేల్ కథలోని ఎమోషన్ ప్రేక్షకులను బలంగా తాకుతుంది. కానీ ‘వేట్టయాన్’ మాత్రం ఆ ఫీలింగ్ ఇవ్వదు.

దర్శకుడి చాలా మంచి ప్రయత్నం చేసాడు ఈసారి కూడా మంచి కథనే చెప్పాడు. సూపర్ స్టార్ ని కొత్తగా ప్రెజెంట్ చేశాడు. ప్రథమార్ధంలో చాలా విజిల్ మూమెంట్స్ ఇచ్చాడు. కానీ మొత్తం గా ఒక పకడ్బందీ సినిమాను ఇవ్వలేకపోయాడు. ఒకసారి చూడ్డానికి ఢోకా లేని.. ‘జస్ట్ ఓకే’ అనిపించే సినిమా ఇది.

Read Also : Pushpa 2: బిజినెస్ ఎంత చేస్తుంది.. హిందీ సంగతేంటి…

నటీనటులు:

సూపర్ స్టార్ ఇందులో ఎంతో కొత్తగా కనిపిస్తారు. ఆయన స్టయిల్లో ఎలివేషన్లు లేవు కానీ అభిమానులను అలరించే సీన్లు పడ్డాయి. చాలా వరకు కథతో పాటే రజిని ప్రయాణించారు.

రజిని కి ఉన్న స్టార్ పవర్ తో పాటు పెర్ఫామెన్స్ కూడా అలరిస్తుంది. ఇందులో కొన్ని మామూలు సీన్లలో కూడా సూపర్ స్టార్ ఆకర్షణీయంగా మార్చారు. అమితాబ్ జడ్జి పాత్రకు హుందాతనం తీసుకొచ్చారు.

సినిమాలో కీలక పాత్ర చేసిన దుషారా విజయన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఫాహద్ ఫాజిల్.. ఈ సినిమాలో వినోదం పంచే పాత్రలో నటించి పెర్ఫార్మన్స్ అదరగొట్టాడు. రజినీ ముందు
నెగెటివ్ పాత్రలో రానా దగ్గుబాటి ఆకట్టుకున్నాడు
రజిని కి దీటుగా నిలబడ్డాడు. రజినీ భార్య పాత్రలో మంజు వారియర్ మెప్పించింది.

సాంకేతిక వర్గం:

అనిరుధ్ రవిచందర్ సంగీతం ఇంకా బావుండాలి అనిపిస్తుంటది. బ్లాక్ బస్టర్ హిట్ ఐన మనసిలాయే పాట బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్, రజినీ ఎలివేషన్ సీన్లలో అనిరుధ్ ఎప్పట్లాగే డ్యూటీ చేశాడు. కదిర్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్ గా సినిమా చాలా బాగుంది.

లైకా నిర్మాణ విలువలూ బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ ప్రయత్నం మాత్రం మెచ్చదగిందే. రజినీని ఈ కథలోకి తీసుకురావడం తోనే దర్శకుడు సగం విజయం సాధించాడు. ఆయన్ని కొత్తగా ప్రెజెంట్ చేసి కథకు రీచ్ ఇవ్వగలిగాడు.

చివరగా: వేట్టయాన్.. వేట ని మధ్యలో ఆపేసాడు….

Rajinikanth Vetteyian Movie review రేటింగ్ – 2.75/5

Follow us on Instagram

The post ‘వేట్టయాన్’ మూవీ రివ్యూ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rajinikanth-vetteyian-movie-full-review/feed/ 0
ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో 3rd ఫిలిం రాబోతుంది…. https://filmybowl.com/prasanth-varma-cinematic-universe-3-indian-super-woman/ https://filmybowl.com/prasanth-varma-cinematic-universe-3-indian-super-woman/#respond Wed, 09 Oct 2024 11:58:55 +0000 https://filmybowl.com/telugu/?p=672 Prasanth Varama Cinematic Universe : టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ PVCU నుండి మరో కొత్త చిత్రం కి రెడీ అవుతున్నాడు.  Prasanth Varama Cinematic Universe : ‘హనుమాన్‌’ సినిమా తో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్‌వర్మ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో లైన్ అప్ తో ఫుల్ బిజీగా మారిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ‘జై హనుమాన్‌’...

The post ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో 3rd ఫిలిం రాబోతుంది…. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Prasanth Varama Cinematic Universe 3 to start rolling - An Indian super woman backdrop
Prasanth Varama Cinematic Universe 3 to start rolling – An Indian super woman backdrop

Prasanth Varama Cinematic Universe : టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ PVCU నుండి మరో కొత్త చిత్రం కి రెడీ అవుతున్నాడు. 

Prasanth Varama Cinematic Universe : ‘హనుమాన్‌’ సినిమా తో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్‌వర్మ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో లైన్ అప్ తో ఫుల్ బిజీగా మారిన విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే ‘జై హనుమాన్‌’ (హనుమాన్) సినిమా కి సీక్వెల్ ni లైన్ అప్ లో ఉంచిన ప్రశాంత్…. నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్షజ్ఞ‌తో కూడా ఒక సినిమా చేయ‌బోతున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ. ఈ విషయాన్నీ గత నేల మోక్షు పుట్టినరోజు రోజు అధికారం గా ప్రకటించాడు. దసరాకి పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని, డిసెంబర్ నుంచి షూటింగ్ కి వెళ్లనున్నట్టు సమాచారం.

అయితే ఈ రెండు సినిమాలు కాకుండా త‌న సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా మ‌రో సినిమా అప్‌డేట్ గురించి ఈరోజు ప్రశాంత్ తన ట్విట్టర్ ఖాతా నుండి అప్డేట్ ఇచ్చాడు.

PVCU నుండి తన కథలతో కొత్త దర్శకులని పరిచయం చేస్తా అని ఇంతక ముందే ప్రచురించిన ప్రశాంత్ ఆ దిశలో అడుగు వేస్తున్నాడు. ఆ ప్రయాణంలో ఈరోజు మొదటి అడుగు పడినట్లు తెలుస్తుంది

ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్ నుంచి మూడో చిత్రం గురించి ఈ రోజు క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వచ్చింది.

Read Also : సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం

PVCU అంటూ వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్‌గా రాబోతున్న‌ట్లు తెలుస్తుంది.

ఇందులో కాళి మాతా బ్యాక్ డ్రాప్ లో ప్ర‌ముఖ హీరోయిన్ ఇండియ‌న్‌ సూప‌ర్ వుమెన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇంకా ఈ సినిమా పేరు, ఇందులో న‌టించే న‌టీన‌టులు ఎవ‌రు అన్న విష‌యాలు గురువారం నాడు తెలియచేస్తా అని ప్రశాంత్ ప్రకటించాడు.

Follow us on Instagram

The post ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో 3rd ఫిలిం రాబోతుంది…. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/prasanth-varma-cinematic-universe-3-indian-super-woman/feed/ 0
సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం https://filmybowl.com/samyuktha-menon-in-heroine-oriented-film/ https://filmybowl.com/samyuktha-menon-in-heroine-oriented-film/#respond Wed, 09 Oct 2024 11:44:57 +0000 https://filmybowl.com/telugu/?p=669 Samyuktha Menon : మలయాళం బ్యూటీ సంయుక్త మీనన్ భీమ్లానాయక్‌, సర్ బింబిసార, డెవిల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. Samyuktha Menon  ఒకానొక దశలో లక్కీ బ్యూటీ గా అందరి హీరోల తో హిట్ సినిమాలే చేసింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరుస ఆఫర్ల తో సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా సంయుక్త మీనన్‌ ప్రయోగాత్మక కథాంశంతో రూపొందించనున్న ఒక లేడీ ఓరియెంటెడ్‌ సినిమా...

The post సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Samyuktha Menon in Heroine oriented film
Samyuktha Menon in Heroine oriented film

Samyuktha Menon : మలయాళం బ్యూటీ సంయుక్త మీనన్ భీమ్లానాయక్‌, సర్ బింబిసార, డెవిల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది.

Samyuktha Menon  ఒకానొక దశలో లక్కీ బ్యూటీ గా అందరి హీరోల తో హిట్ సినిమాలే చేసింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరుస ఆఫర్ల తో సినిమాలతో బిజీగా ఉంది.

తాజాగా సంయుక్త మీనన్‌ ప్రయోగాత్మక కథాంశంతో రూపొందించనున్న ఒక లేడీ ఓరియెంటెడ్‌ సినిమా చేయబోతుంది. ఆ సినిమా కి ఈరోజే లాంఛనం గా ప్రారంభించారు.

రానా దగ్గుబాటి ముఖ్య అతిదిగా క్లాప్ నివ్వ‌గా హాజరై సినిమా బృందానికి శుభకాంక్షలు తెలియ చేసారు. ఈ చిత్రం తప్పకుండ మంచి విజయం సాధిస్తుందని ఇంకా ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మారని రావాలని తను కోరుతున్నట్టు చెప్పారు. నిర్మాతలు దిల్‌ రాజు, కోనా వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

Read Also : రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ?

యోగేష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని రాజేష్‌ దండా హాస్య మూవీస్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

సంయుక్త చిత్ర విశేషాలని మీడియా కి పంచుకున్నారు.. ఈ ప్రాజెక్ట్‌లో నేను భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. తెలుగులో నేను చేసిన సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రాబోతున్నాను. కథలోని కొత్తదనం సినిమా లో ప్రతి 20 నిమిషాలకి వచ్చే ట్విస్ట్స్ నచ్చడంతో సంయుక్త మీనన్‌ ఈ సినిమా ని అంగీకరించినట్టు చెప్తుంది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మాత తెరకెక్కించబోతున్నారని తెలిసింది. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నది.

Follow us on Instagram

The post సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/samyuktha-menon-in-heroine-oriented-film/feed/ 0
రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ? https://filmybowl.com/after-sukumar-its-with-prashanth-neel-for-ram-charan/ https://filmybowl.com/after-sukumar-its-with-prashanth-neel-for-ram-charan/#respond Wed, 09 Oct 2024 11:15:31 +0000 https://filmybowl.com/telugu/?p=666 Prashanth Neel Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ కథానాయికగా గా తమిళ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రాజు నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 20 లేదా 25 న ఈ సినిమా ని ప్రేక్షకుల...

The post రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
After Sukumar, it's with Prashanth Neel for Ram Charan
After Sukumar, it’s with Prashanth Neel for Ram Charan

Prashanth Neel Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ కథానాయికగా గా తమిళ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రాజు నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 20 లేదా 25 న ఈ సినిమా ని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్టు ప్రొడ్యూసర్ ఆల్రెడీ అనౌన్స్ చేసారు.

ఈ చిత్రం తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో నెక్స్ట్ మూవీ చేయనున్నాడు చరణ్ ఆ తరువాత తనకి రంగస్థలం లాంటి కల్ట్ క్లాసిక్ ని అందించి ప్రేక్షకులకి మరింత దెగ్గర చేసిన సుకుమార్ తో మరొక మూవీ కూడా ఇప్పటికే కమిట్ అయ్యారు.

ఇక ఆ తర్వాత ఎవరితో చేయబోతున్నారు ane దానికి ఆల్మోస్ట్ సమాధానం దొరికేసింది. KGF, సలార్ తో మాస్ మూవీ అంటే ఇలా కూడా తీయచ్చు అని పాన్ ఇండియా లెవెల్ లో మాస్ కి కొత్త అర్ధం చెప్పిన ప్రశాంత్ నీల్ తో తదుపరి చిత్రం కమిట్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, త్వరలో ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

Read Also : దృశ్యం – ది కంక్లూషన్

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉన్న ప్రశాంత్ నీల్ ఖాతాలో సలార్ 2, కెజిఎఫ్ 3 కూడా ఉన్నాయి

అయితే ప్రస్తుతం టాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ఈ మూడు సినిమాల తర్వాత ప్రశాంత్…. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక మూవీ కమిట్ అయ్యారని ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు.

దసరా కానుకగా ఈ సినిమా గురించి కన్ఫర్మేషన్ రానున్నట్టు ఇండస్ట్రీ లో చెప్తున్నారు

Follow us on Instagram

The post రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/after-sukumar-its-with-prashanth-neel-for-ram-charan/feed/ 0
దృశ్యం – ది కంక్లూషన్ https://filmybowl.com/dhrushyam-will-be-back-next-year/ https://filmybowl.com/dhrushyam-will-be-back-next-year/#respond Wed, 09 Oct 2024 10:16:53 +0000 https://filmybowl.com/telugu/?p=663 Dhrushyam : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ది బెస్ట్ థ్రిల్లర్స్ అంటూ లిస్టు తీస్తే దాంట్లో మలయాళ సినిమా ‘దృశ్యం’ అగ్ర భాగాన ఉంటుంది. భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒకళ్ళు ఈ సినిమా ను తెగ ఆదరించారు. మలయాళంలో దృశ్యం బ్లాక్ బస్టర్ అయ్యాక ఈ సినిమా ని వివిధ భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ ) ఈ చిత్రాన్ని రీమేక్ చేసారు....

The post దృశ్యం – ది కంక్లూషన్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Dhrushyam will be back next year
Dhrushyam will be back next year

Dhrushyam : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ది బెస్ట్ థ్రిల్లర్స్ అంటూ లిస్టు తీస్తే దాంట్లో మలయాళ సినిమా ‘దృశ్యం’ అగ్ర భాగాన ఉంటుంది. భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒకళ్ళు ఈ సినిమా ను తెగ ఆదరించారు.

మలయాళంలో దృశ్యం బ్లాక్ బస్టర్ అయ్యాక ఈ సినిమా ని వివిధ భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ ) ఈ చిత్రాన్ని రీమేక్ చేసారు. బాష తో సంబంధం లేకుండా యాక్టర్ డైరెక్టర్ ఎవరా అని చూడకుండా తీసిన ప్రతి చోట పెద్ద విజయం సాధించింది.

లోకల్ భాషల్లోనే రీమేక్ అయి అన్నిట్లో ప్రేక్షకుల్ని మెప్పించడమే ఆశ్చర్యం అయితే విదేశీ భాషల్లో సైతం ఈ చిత్రం రీమేక్ అయి మంచి ఫలితాన్ని అందుకోవడం విశేషం.

ఆల్రెడీ ‘దృశ్యం’కు కొనసాగింపుగా మోహన్ లాల్-జీతు జోడీ సీక్వెల్ ‘దృశ్యం-2’ తీస్తే అది కూడా అద్భుత స్పందన తెచ్చుకుంది. నేరుగా ఓటీటీలో రిలీజై కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది అంటే ఈ సిరీస్ కి ప్రజలు ఎంతలా బ్రహ్మరథం పెట్టారో తెలుస్తుంది.

దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ‘దృశ్యం-3’ కూడా ఉంటుందనే సంగతి అప్పుడే ఖరారైంది. ఇప్పుడీ సినిమాను ఆఫిషియల్ గానే ప్రకటించారు. వచ్చే ఏడాది చివర్లో దృశ్యం-3’ ప్రేక్షకుల ముందుకు వస్తుందట.

Read Also : రామాయణాన్ని ఇలా వాడేశారు

మలయాళ ఇండస్ట్రీ సినిమాలన్నీ క్వాలిటీ తో ఎక్కువ టైం తీసుకోకుండా చక చక తీస్తుంటారు. ప్రస్తుతం మోహన్ లాల్, జీతు జోసెఫ్ వేర్వేరు కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడం తో. వచ్చే సంవత్సరం ఈ దృశ్యం-3ని సెట్స్ మీదికి తీసుకొని వెళ్లి క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకి తెస్తారని మీడియా వర్గాలకి తెలియచేసారు.

ఐతే ఈసారి దృశ్యం కథను ఇంతటితో కంప్లీట్ చేయనున్నారు. ఇంకో పార్ట్ అంటే ప్రేక్షకులు కి సాగతీత వ్యవహారం అనిపిస్తుందని అనుకున్నారో ఏమో గాని మూడో పార్ట్‌తో సినిమాను ముగించేయాలని లాల్, జీతు ఫిక్సయ్యారట. అందుకే టైటిల్ కూడా అదే తెలియచేస్తుంది

Follow us on Instagram

The post దృశ్యం – ది కంక్లూషన్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/dhrushyam-will-be-back-next-year/feed/ 0
రామాయణాన్ని ఇలా వాడేశారు https://filmybowl.com/hindi-singham-is-back-with-ramayanam-touch/ https://filmybowl.com/hindi-singham-is-back-with-ramayanam-touch/#respond Wed, 09 Oct 2024 10:11:53 +0000 https://filmybowl.com/telugu/?p=660 Hindi singham Ramayanam : రామాయణం ఎన్ని సార్లు తీసినా చూడడానికి ఇంతకంటే అభిమానులు ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది ఉంటారు. అలాగే రామాయణం కాన్సెప్ట్ మీద కూడా. అదేలా అంటే రామాయణంలో పాత్రలని ప్రేరణగా తీసుకోని ఆ కథకి కొంచెం కావాల్సిన హంగులు జోడించి సినిమాగా. అప్పట్లో మణిరత్నం విక్రమ్ హీరోగా రావణ్ అనే సినిమా తీశారు. ఆ సినిమాకి రామాయణమే ప్రేరణ. ఇప్పుడు ఇది...

The post రామాయణాన్ని ఇలా వాడేశారు appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Hindi singham is back with Ramayanam touch
Hindi singham is back with Ramayanam touch

Hindi singham Ramayanam : రామాయణం ఎన్ని సార్లు తీసినా చూడడానికి ఇంతకంటే అభిమానులు ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది ఉంటారు. అలాగే రామాయణం కాన్సెప్ట్ మీద కూడా.

అదేలా అంటే రామాయణంలో పాత్రలని ప్రేరణగా తీసుకోని ఆ కథకి కొంచెం కావాల్సిన హంగులు జోడించి సినిమాగా. అప్పట్లో మణిరత్నం విక్రమ్ హీరోగా రావణ్ అనే సినిమా తీశారు. ఆ సినిమాకి రామాయణమే ప్రేరణ. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మరో సినిమా అదే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

నార్త్ లో సౌత్ టైప్ డైరెక్టర్ అని చెప్పుకునే రోహిత్ శెట్టి
సింగం ఫ్రాంచైజ్ లో భాగం గా సింగం అగైన్ ని దీపావళి కానుకగా దించుతున్నాడు.

అస్సలు ప్రజలకి సింగం ని పరిచయం చేసింది తమిళ స్టార్ హీరో సూర్య, ఫాస్ట్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ హరినే. ఐన కానీ దాన్ని విజయవంతంగా సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీస్తూ ముందుకు తీసుకెళ్తున్నది మాత్రం రోహిత్ శెట్టినే.

మాస్ పోలీస్ గా సింగం ని చూయిస్తూ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే మొట్ట మొదటిసారిగా ఆల్మోస్ట్
అయిదు నిమిషాల ఉన్న ట్రైలర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. అంతేకాదు హిందీలోనే ఈ సినిమా అతి పెద్ద మల్టీస్టారర్స్ లో ఒకటిగా దీనికి ప్రత్యేకంగా స్థానం లభిస్తుంది అనడం లో సందేహం లేదు.

Read Also : పరుశురాం నెక్స్ట్ హీరో అతనేనా…

పోలీస్ కథలు ఎప్పుడు ఒకే ఫార్మాట్ లో ఉంటాయి. స్క్రీన్ ప్లే లో మార్పులు తప్పించి అప్పటి కొండవీటి సింహం నుంచి రేపు రాబోయే స్పిరిట్ వరకు కాకపోతే ఇందులో రోహిత్ శెట్టి చాలా తెలివిగా రామాయణాన్ని ఈ కథలో ఇంక్లూడ్ చేసి సినిమాగా మన ముందుకి తీసుకొస్తున్నాడు.

పోలీస్ ఆఫీసర్ అయిన సింగం ఈ సినిమా లో రాముడు పోలిన పాత్ర. ఆయన భార్య కరీనా కపూర్ సీతాదేవి ని పోలిన పాత్ర. ఇక శ్రీలంకలో ఉండే విలన్ అర్జున్ కపూర్ ఎవరో మీకు ఈ పాటికే అర్ధమై ఉంటది

ఇంకేముంది అర్జున్ కపూర్…. కరీనా ని ఎత్తుకెళ్లిపోతాడు. ఇక భార్య ని కాపాడి తీసుకు రాడానికి బయల్దేరిన సింగం కి సాయం కోసం హనుమంతుడు మన రణ్వీర్ సింగ్ సాయపడతాడు
సింగం సోదరుడి గా లక్ష్మణుడి తరహా పాత్రలో టైగర్ శ్రోఫ్ గరుత్మంతుడి గా అక్షయ్ కుమార్ కనిపిస్తాడు. ఇంకా ఈ కధలో ఇంకో పాత్ర లేడీ సింగం గా దీపికా పదుకునే కనిపించనుంది.

ఈ పాత్రలన్నీ కలిసి అపహరించుకుపోయిన రావణుడి పని పట్టి సీతను కాపాడుకోవడం ఎలా చేశారనే పాయింట్ మీద ఈ కొత్త సింగం నడుస్తుంది.

ఎప్పటిలాగే మాస్ మసాలా మోతాదుకు మించి దట్టించాడు దర్శకుడు రోహిత్ శెట్టి. యాక్షన్ ఎపిసోడ్లు, ఛేజింగులు, బాంబ్ బ్లాస్టులు, వాహనాల హంగామా, హెలికాప్టర్స్ లతో యుద్దాలే డిజైన్ చేసాడు.

నార్త్ బిజినెస్ సర్కిల్ ప్రకారం మంచి ఓపెనింగ్ తో పాటు వార్ జవాన్ రికార్డులను సులభంగా బద్దలు కొట్టిద్ది అంటున్నారు సింగం అగైన్.

కథ రామాయణం కాబట్టి దానికి ఢోకా ఉండదు. మాస్ ఎలేవేషన్స్ సాలిడ్ గా ఉండి మాస్ కి కనెక్ట్ అయితే మాత్రం సింగల్ స్క్రీన్లలో సింగం గర్జన ని ఎవరు ఆపలేరు.

Follow us on Instagram

The post రామాయణాన్ని ఇలా వాడేశారు appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/hindi-singham-is-back-with-ramayanam-touch/feed/ 0
విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది… https://filmybowl.com/sreenu-vaitla-is-back-to-his-strong-zone-with-viswam/ https://filmybowl.com/sreenu-vaitla-is-back-to-his-strong-zone-with-viswam/#respond Mon, 07 Oct 2024 17:16:54 +0000 https://filmybowl.com/telugu/?p=653 Sreenu Vaitla Viswam : దర్శకుడు వైట్ల, మ్యాచో మ్యాన్ గోపీచంద్, ఇంకా చెప్పాలంటే ప్రజల మీడియా సమస్త ముగ్గురు ఒక దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అదే విజయం. ఎన్నో విజయాలని చవి చూసిన ఈ ముగ్గురు ఇప్పుడు ఒక మంచి విజయం కోసం ప్రేక్షకుల ముందుకి విశ్వం తో వస్తున్నారు దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న విశ్వం సినిమా ట్రైలర్ ఈరోజు చిత్రబృందం రిలీజ్...

The post విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది… appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Sreenu Vaitla is back to his strong zone with Viswam
Sreenu Vaitla is back to his strong zone with Viswam

Sreenu Vaitla Viswam : దర్శకుడు వైట్ల, మ్యాచో మ్యాన్ గోపీచంద్, ఇంకా చెప్పాలంటే ప్రజల మీడియా సమస్త ముగ్గురు ఒక దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అదే విజయం.

ఎన్నో విజయాలని చవి చూసిన ఈ ముగ్గురు ఇప్పుడు ఒక మంచి విజయం కోసం ప్రేక్షకుల ముందుకి విశ్వం తో వస్తున్నారు

దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న విశ్వం సినిమా ట్రైలర్ ఈరోజు చిత్రబృందం రిలీజ్ చేసింది. మరి ఎలావుందో తెలుసుకుందాం పదండి.

‘బోర్డర్ దగ్గర టెర్రరిస్టులను తుడిచి పెడుతుంటే.. నేను ఈ దేశం నుంచి టెర్రరిస్టులను పుటిస్తున్నాను.. భారత దేశం మొత్తం దీపావళి జరగబోతోంది’ అంటూ ఓ ఉగ్రవాది బెదిరింపు తో ట్రైలర్ ప్రారంభమైంది.

భారతదేశ సరిహద్దులో కావలి కాసే జవాన్ గా గోపీచంద్ కనపడ్డాడు. ఇక అక్కడ నుంచి ప్రముఖ నటీనటులను దర్శకుడు చూపించారు. కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. ఒకప్పటి శ్రీను వైట్ల కనిపించారు అని అనుకోవచ్చు. దీంతో ట్రైలర్ ఫన్నీ మోడ్ లోకి వెళ్లింది.

గోపీచంద్ ని రెండు వేరియేషన్స్ లో ట్రైలర్ లో చూయించారు అది సూపర్ గా వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి. కావ్య థాపర్ తో హీరో లవ్ స్టోరీని కూడా కొన్ని షాట్స్ లో చూయించారు

వెంకీ సినిమాలోని బ్లాక్ బస్టర్ ఐన ట్రైన్ ఎపిసోడ్ ని ఈ సినిమా లో వెన్నెల కిషోర్, నరేష్ ఇంకా మిగతా ఆక్టర్స్ తో కనువిందుగా చూయించారు ఇక యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ ను నింపారు.

యాక్షన్ సీన్స్ అంటే గోపీచంద్ అదరగొట్డతాడు అనడం లో డౌట్ ఏ అక్కర్లేదు .స్టైలిష్ గా కూడా కనిపించారు. కావ్య థాపర్ గ్లామరస్ గా కనిపిస్తూ సందడి చేసింది.

Read Also : మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా

విశ్వం ట్రైలర్ లో వింటేజ్ శ్రీను వైట్ల మార్క్ ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. యాక్షన్& కామెడీ సినిమాలో ఒక రేంజ్ లో ఉండేటట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కి దూకుడు ఫేమ్ వి.గుహన్ సినిమాటోగ్రఫీ, చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ల ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి.

Follow us on Instagram

The post విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది… appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/sreenu-vaitla-is-back-to-his-strong-zone-with-viswam/feed/ 0
కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా ? https://filmybowl.com/suriya-kanguva-has-a-relation-with-24/ https://filmybowl.com/suriya-kanguva-has-a-relation-with-24/#respond Mon, 07 Oct 2024 08:02:25 +0000 https://filmybowl.com/telugu/?p=650 Suriya – Kanguva : తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య, శివ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం కంగువా. ఈ సినిమా ని మొదట అనుకున్న ప్రకారం దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ అదే సమయం లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ప్రకటించడం తో కంగువా సినిమాను నవంబర్‌ 14కు వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ టైటిల్ చూసి ఈ...

The post కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Suriya Kanguva has a relation with 24
Suriya Kanguva has a relation with 24

Suriya – Kanguva : తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య, శివ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం కంగువా. ఈ సినిమా ని మొదట అనుకున్న ప్రకారం దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ అదే సమయం లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ప్రకటించడం తో కంగువా సినిమాను నవంబర్‌ 14కు వాయిదా వేయడం జరిగింది.

ఇప్పుడు ఈ టైటిల్ చూసి ఈ సినిమా 14 నుంచి 24 కి మారిందా అనుకుంటారేమో అలాంటిదేమి లేదు. 14వ తారీకే సినిమా వస్తుంది అని చిత్ర బృందం ప్రకటించింది.

మరి ఈ కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా…. సరే తెలుసుకుందాం పదండి.

సౌత్ ఇండస్ట్రీలో టైమ్ ట్రావెల్ సినిమాలూ చాలానే వచ్చాయి. దాంట్లో అందరికి గుర్తొచ్చే సినిమా బాలయ్య నటించిన ఆదిత్య 369. మళ్లీ ఆ తర్వాత అంతగా అందరికి గుర్తొచ్చే సినిమా సూర్య నటించిన 24.

టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ తీసిన సినిమా చాలా మంచి పేరు తెచ్చుకోవడమే గాక సూర్య లోని విలన్ ని కూడా ప్రేక్షకులకి పరిచయం చేసింది. ఇక ఇప్పుడు 24 టాపిక్ ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారు కదా. కంగువా సినిమా గురించి మీడియాలో బాగా వినపిస్తున్న విషయం ఏంటంటే

ఈ సినిమా ఒక టైమ్ ట్రావెల్‌ కథ అంట, రెండు టైమ్ జోన్ ల మధ్య సాగే ఈ కథ లో సూర్య రెండు చాలా విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. వంద ఏళ్ళ క్రితం కథ ను 2024 కాలానికి కలుపుతూ సాగే కథ తో కంగువా రూపొందినట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడున్న టెక్నాలజీని దాదాపు 100 సంవత్సరాల క్రితమే వినియోగిస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా కథ ఈ సినిమా లో దర్శకుడు చూయించబోతున్నట్టు తెలుస్తుంది. మాస్ యాక్షన్ సినిమాలను ఇప్పటి వరకు తీసి మెప్పించిన డైరెక్టర్ శివ. ఈ సినిమాను మాత్రం అంతకు మించి అన్నట్లుగా రూపొందించాడు అంటున్నారు.

Read Also : మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా

తమిళ్‌ లో భారీ గా రూపొందిన ఈ సినిమా దాదాపు 34 భాషల్లో విడుదల చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక భారతీయ సినిమా ఇన్ని భాషల్లో ఒకే సారి విడుదల అవ్వడం రికార్డు అనే చెప్పాలి. తమిళ్‌ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి దాకా వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేసే సినిమా రాలేదు. ఆ ఫీట్ ని అందుకునే మొదటి సినిమా కంగువా అని కోలీవుడ్ బలం గా నమ్ముతుంది. ఇక సినిమా మీద అంచనాలు భారీగా ఉండడం తో కంగువా వసూళ్లు ఎలా ఉంటాయో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

సూర్య కు ఇది ల్యాండ్ మార్క్ సినిమా గా నిలిచే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దిశా పటానీ కధానాయిక గా కనిపించనుంది.

Follow us on Instagram

The post కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా ? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/suriya-kanguva-has-a-relation-with-24/feed/ 0
మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా https://filmybowl.com/raviteja-76-with-tamil-director-mostly/ https://filmybowl.com/raviteja-76-with-tamil-director-mostly/#respond Mon, 07 Oct 2024 07:50:33 +0000 https://filmybowl.com/telugu/?p=646 RaviTeja 76 : రవితేజ.. సినీ పరిశ్రమలో ఈ తరం నటులకి ఒక ప్రేరణ. ఎటువంటి బ్యాకప్ లేకపోయిన విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి మాస్ మహారాజా దాగా ఎదిగాడు. రవితేజ యాక్షన్‌కి, కామెడీకి ఎప్పుడు ఫ్యాన్స్ ఆడియన్స్‌ ఉంటారు ఆయన సినిమాలు చూసి కడుపారా నవ్వుకోని ప్రేక్షకులు ఉండరు అయితే ఇటీవల కాలంలో రవితేజ సినిమాల్లో మజా తగ్గుతోంది. ఇంకేదో ఎక్కువవుతుంది అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవేంటో మీ...

The post మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
RaviTeja 76 with Tamil director mostly
RaviTeja 76 with Tamil director mostly

RaviTeja 76 : రవితేజ.. సినీ పరిశ్రమలో ఈ తరం నటులకి ఒక ప్రేరణ. ఎటువంటి బ్యాకప్ లేకపోయిన విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి మాస్ మహారాజా దాగా ఎదిగాడు. రవితేజ యాక్షన్‌కి, కామెడీకి ఎప్పుడు ఫ్యాన్స్ ఆడియన్స్‌ ఉంటారు ఆయన సినిమాలు చూసి కడుపారా నవ్వుకోని ప్రేక్షకులు ఉండరు

అయితే ఇటీవల కాలంలో రవితేజ సినిమాల్లో మజా తగ్గుతోంది. ఇంకేదో ఎక్కువవుతుంది అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవేంటో మీ అందరికి తెలుసు.

ఆ విషయం పక్కన పెడితే రవితేజ కి ఈ మధ్య హిట్స్ లేవు ఎప్పుడో వచ్చిన ఒకట్రెండు విజయాలు కూడా కామెడీ సినిమాలతోనే అందుకున్నారు. ఇప్పుడు
తిరిగి థాన స్టామినా ని ఇండస్ట్రీ కి గుర్తు చెయ్యడానికి
చూస్తున్న రవితేజ.. మరోసారి కామెడీ తోనే వస్తున్నట్టు తెలుస్తుంది.

రవితేజ సినిమాల జోరుకు హిట్ ప్లాప్ అనేవి పెద్దగా
అడ్డు రావు. మంచి విజయం పడితే ఎక్కువ అవకాశాలు వచ్చేయడం, ఫ్లాప్ పడితే ఢీలా పడిపోయి ఆగిపోదాం లాంటివి వుండవు.

Read Also : OG పెద్ద రేంజ్ హిట్ అవుతుంది – ఎస్ ఎస్ థమన్

ఈ విషయం మీరు రీసెంట్‌గా వరుస flops అందుకుంటున్నా సినిమాలూ ఒప్పుకోడం మాత్రం ఎక్కడ తగ్గలేదు. అందుకే వరుసగా ఎన్ని ప్లాప్స్ వచ్చినా చేతిలో రెండు సినిమాల తో బిజీ గా ఉన్నాడు మరో సినిమా దాదాపు ఓకే అయింది.

RT75 సినిమా షూటింగ్ లో గాయాల పాలయ్యి గ్యాప్ తీసుకుంటున్న రవి ని ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు సుంద‌ర్.సి కలిసి ఒక కథ చెప్పినట్టు తెలుస్తుంది. కథ నచ్చడం తో సినిమా చేయడానికి రవితేజ ఆసక్తికగా ఉన్నారు అని తెలుస్తుంది.

రవి తేజ సొంత నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్‌ వర్క్స్‌, సుందర్‌.సి నిర్మాణ సంస్థ కలసి ఈ సినిమా నిర్మాణం చేపడతారని అంటున్నారు. సుందర్‌ కి కామెడీ మీద మంచి పట్టున్న దర్శకుడు. రవితేజ కు కామెడీ కొట్టిన పిండి. ఈ నేపథ్యంలో ఇద్దరూ కాంబినేషన్ లో సినిమా అంటే వినోదం ఎలా ఉంటదో వేరే చెప్పాలా. అన్నీ కుదిరితే రవితేజ 75 తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.

Follow us on Instagram

The post మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/raviteja-76-with-tamil-director-mostly/feed/ 0
మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్.. ఎమోషనల్ రైడ్ https://filmybowl.com/maa-nanna-super-hero-movie-trailer-released/ https://filmybowl.com/maa-nanna-super-hero-movie-trailer-released/#respond Sun, 06 Oct 2024 07:31:49 +0000 https://filmybowl.com/telugu/?p=643 Maa Nanna Super hero : డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ వరుసగా సినిమాలను చేస్తూ అలరిస్తున్న హీరో సుధీర్ బాబు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కథలనే నమ్ముకొని అదే పంథాలో వెళుతున్న సుధీర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 2024లో హరోం హర సినిమా తో ప్రేక్షకులని పలకరించిన ఆయన.. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అంటూ మన ముందుకి రానున్నాడు. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం...

The post మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్.. ఎమోషనల్ రైడ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Maa Nanna Super hero Movie Trailer Released
Maa Nanna Super hero Movie Trailer Released

Maa Nanna Super hero : డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ వరుసగా సినిమాలను చేస్తూ అలరిస్తున్న హీరో సుధీర్ బాబు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కథలనే నమ్ముకొని అదే పంథాలో వెళుతున్న సుధీర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

2024లో హరోం హర సినిమా తో ప్రేక్షకులని పలకరించిన ఆయన.. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అంటూ మన ముందుకి రానున్నాడు. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వ‌హిస్తున్న ee సినిమాలో ఆర్ణ కథానాయికగా నటిస్తున్నారు.

దసరాని పురస్కరించుకొని అక్టోబర్ 11వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు నిర్మాత ఇప్పటికే అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ లో టీం బిజీ అయిపోయింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా
సినిమా ట్రైలర్ ను శనివారం రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి ట్రేండింగ్ తో వ్యూస్ అందుకుంటున్న ట్రైలర్.. టీజర్ ను మించిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిపోయిందని కామన్ ఆడియన్స్ చెబుతున్నారు.

“ఒకప్పుడు ఈ డబ్బు అవసరమే నా కొడుకును నాకు దూరం చేసింది. దాని విలువ 25 సంవత్సరాలు”
అంటూ ఫిదా ఫేమ్ సాయి చంద్ చెప్పిన డైలాగ్‌‌ ‌తో ట్రైలర్ ఓపెన్ అయింది.

డ‌బ్బు కోసం పుట్టగానే తన కొడుకు (సుధీర్ బాబు)ను తండ్రి (సాయి చంద్) అమ్ముకుంటాడు అన్నట్టు అర్ధం అవుతుంది. ఆ తర్వాత సీన్ లో షాయాజీ షిండే…. సుధీర్ బాబు కి తండ్రి గా కనిపిస్తాడు బహుశా

జ‌న్మ ఇవ్వ‌లేక‌పోయినా సుధీర్ బాబును త‌న కొడుకుగా పెంచుకుంటాడు షాయాజీ షిండే. ఆయన ఓ విషయంలో జైలు పాలవుతాడు. అప్పుడే కొడుకు కోసం 25 ఏళ్ల త‌ర్వాత సాయి చంద్ మళ్ళి తిరిగి వస్తాడు.

అయితే తన కన్న తండ్రి తిరిగి వచ్చాక సుధీర్ పరిస్థితి ఏంటి? పెంచిన తండ్రి జైలు పాలవ్వడంతో హీరో అతని కోసం ఎం చేశాడు? బయటకు తీసుకొచ్చాడా? అన్న విషయాల కోసం సినిమా చూడాల్సిందే.

Read Also : OG పెద్ద రేంజ్ హిట్ అవుతుంది – ఎస్ ఎస్ థమన్

ట్రైలర్ లో డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా, మంచి డెప్త్ తో ఉన్నాయి. సుధీర్ బాబుతో పాటు ఆయనను పెంచిన తండ్రి, కన్న తండ్రి పాత్రల్లో నటించిన షాయాజీ షిండే, సాయి చంద్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.

ట్రైలర్ చివర్లో మహేష్ బాబు రిఫరెన్స్ కూడా యాడ్ చేయడం అభిమానులకి నచ్చే అంశమే. మొత్తంగా ట్రైలర్ అందరినీ నచేసిద్ధి అలానే సినిమాపై హోప్స్ పెంచేస్తుంది.

తండ్రీకొడుకుల సెంటిమెంట్‌, హ్యూమన్ ఎమోషన్స్ తో మూవీ రాబోతుండగా.. సుధీర్ పక్కాగా హిట్ ఈసారి తన ఖాతాలో వేసుకుంటాడని అంతా ధీమాగా ఉన్నారు

సీఏఎమ్‌ ఎంటర్టైన్మెంట్స్‌, వీ సెల్యులాయిడ్స్‌ కలిసి ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. రాజు సుందరం, శశాంక్, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరి మా నాన్న సూపర్ హీరో మూవీ మీదున్న అంచనాలని అందుకొని ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

 

Follow us on Instagram

The post మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్.. ఎమోషనల్ రైడ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/maa-nanna-super-hero-movie-trailer-released/feed/ 0