Kalyan ram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/kalyan-ram/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 08 Apr 2025 13:17:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Kalyan ram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/kalyan-ram/ 32 32 సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ రామ్ లేటెస్ట్ యాక్షన్ మూవీ.. రన్ టైం ఎంతంటే..? https://filmybowl.com/kalyan-rams-latest-action-movie-has-completed-censoring-what-is-the-runtime/ https://filmybowl.com/kalyan-rams-latest-action-movie-has-completed-censoring-what-is-the-runtime/#respond Tue, 08 Apr 2025 13:17:08 +0000 https://filmybowl.com/telugu/?p=3521 నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ చిత్రం “అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి”.. నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఎంతో గ్రాండ్ గా తెర కెక్కిన ఈ మూవీ తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది.ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 24...

The post సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ రామ్ లేటెస్ట్ యాక్షన్ మూవీ.. రన్ టైం ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ చిత్రం “అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి”.. నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఎంతో గ్రాండ్ గా తెర కెక్కిన ఈ మూవీ తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది.ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలుగా వుంది.పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెర కెక్కింది..ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.ఈ సినిమాను అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక వర్ధన్ ముప్ప మరియు సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18 న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. త్రివిక్రమ్ మూవీపై బిగ్ సర్ప్రైజ్..!!

తాజాగా విడుదల అయిన సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరియు విజయశాంతి అద్భుతమైన నటనతో అలరించారు. విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో బలమైన తల్లి పాత్రను పోషిస్తూ, కళ్యాణ్ రామ్‌తో కలిసి ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు.. తల్లి-కొడుకు మధ్య సంఘర్షణ కథకు ప్రధాన ఆధారంగా నిలిచింది..విజయశాంతి న్యాయం కోసం పోరాడుతుండగా, కళ్యాణ్ రామ్ తన సొంత మార్గంలో నేరస్థులపై పోరాడటం కథను ఆసక్తికరంగా మలుస్తుందని తెలుస్తుంది. తల్లి, కొడుకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయి.. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అస్సలు ఊహించని విధంగా ఉంటుందని సమాచారం..

కళ్యాణ్ రామ్ యాక్షన్ అవతార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోనుంది. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోయడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్, యాక్షన్‌ సీన్స్ ను మరింత ఎలివేట్ చేస్తుందని సెన్సార్ రిపోర్ట్ లో వుంది…ఈ సినిమాలో.సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్, శ్రీకాంత్ వంటి నటీనటులు కూడా కీలక పాత్రలలో నటించారు.

The post సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ రామ్ లేటెస్ట్ యాక్షన్ మూవీ.. రన్ టైం ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kalyan-rams-latest-action-movie-has-completed-censoring-what-is-the-runtime/feed/ 0
‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/kalyan-ram-coming-as-arjun-son-of-vyjayanthi-latest-poster-is-amazing/ https://filmybowl.com/kalyan-ram-coming-as-arjun-son-of-vyjayanthi-latest-poster-is-amazing/#respond Sat, 08 Mar 2025 15:30:23 +0000 https://filmybowl.com/telugu/?p=3026 నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం నిర్మాతగా వరుస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో వున్నాడు..తన తమ్ముడు తారక్ తో నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇటీవల తన బ్యానర్ లో వచ్చిన”దేవర” సినిమా భారీ సక్సెస్ అయింది.. త్వరలోనే ఎన్టీఆర్ తో “డ్రాగన్”, దేవర 2 సినిమాలు చేయనున్నాడు.. ఇదిలా ఉంటే కల్యాణ్ రామ్ హీరోగా రాణించేందుకు కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు..2023 లో...

The post ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం నిర్మాతగా వరుస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో వున్నాడు..తన తమ్ముడు తారక్ తో నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇటీవల తన బ్యానర్ లో వచ్చిన”దేవర” సినిమా భారీ సక్సెస్ అయింది.. త్వరలోనే ఎన్టీఆర్ తో “డ్రాగన్”, దేవర 2 సినిమాలు చేయనున్నాడు.. ఇదిలా ఉంటే కల్యాణ్ రామ్ హీరోగా రాణించేందుకు కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు..2023 లో ఆయన నటించిన చివరి సినిమా “డెవిల్”.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాకు మంచి పేరు  వచ్చింది కానీ కమర్షియల్ గా మాత్రం.అంతగా మెప్పించలేదు.అయితే గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.

దేవర : పార్ట్ 2 లో ఊహకందని సర్ప్రైజ్ లు… మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!!

ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. కల్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.ఇదివరకు ఎన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్‌ కనిపించబోతున్నాడు. ”కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా అవుట్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా గా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు గత కొన్నాళ్లుగా ‘మెరుపు’ అనే టైటిల్ వినిపించింది.

అయితే తాజాగా ఈ సినిమాకు “ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి “.. అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసారు..ఉమెన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ రివీల్ చేసారు..అలాగే ఈ సినిమాలో సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా సోహేల్ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు..

 

 

The post ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kalyan-ram-coming-as-arjun-son-of-vyjayanthi-latest-poster-is-amazing/feed/ 0
బాలయ్యకి పద్మభూషణ్.. భువనేశ్వరి పార్టీ.. హాజరవని ఎన్టీఆర్.. కారణం అదేనా..? https://filmybowl.com/balayya-gets-padma-bhushan-bhuvaneswaris-party-ntr-doesnt-attend-is-that-the-reason/ https://filmybowl.com/balayya-gets-padma-bhushan-bhuvaneswaris-party-ntr-doesnt-attend-is-that-the-reason/#respond Sun, 02 Feb 2025 15:07:34 +0000 https://filmybowl.com/telugu/?p=2367 నందమూరి నటసింహం బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ చరిత్రలో నటుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించాడు.. ఆయన నటించిన ప్రతీ పాత్ర వెండితెరపై చిరస్థాయిలో నిలిచిపోతుంది.. బాలయ్య ఇన్నేళ్ల తన సినీ కేరీర్ లో అశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు.. తాను నటించిన ప్రతీ పాత్ర తన అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయేలా బాలయ్య అద్భుతంగా నటించి మెప్పిస్తారు.. ఈ 50 సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీకి చేస్తున్న సేవలకు అలాగే...

The post బాలయ్యకి పద్మభూషణ్.. భువనేశ్వరి పార్టీ.. హాజరవని ఎన్టీఆర్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ చరిత్రలో నటుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించాడు.. ఆయన నటించిన ప్రతీ పాత్ర వెండితెరపై చిరస్థాయిలో నిలిచిపోతుంది.. బాలయ్య ఇన్నేళ్ల తన సినీ కేరీర్ లో అశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు.. తాను నటించిన ప్రతీ పాత్ర తన అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయేలా బాలయ్య అద్భుతంగా నటించి మెప్పిస్తారు.. ఈ 50 సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీకి చేస్తున్న సేవలకు అలాగే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిద్వారా పేదలకు చేస్తున్న సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.

తండేల్ : అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా.. చందూ మొండేటి షాకింగ్ కామెంట్స్..!!

ఈ సందర్భంగా బాలయ్యకు నందమూరి కుటుంబ సభ్యులతోపాటు నారా వారి కుటుంబ సభ్యులు, తెలుగు సినీ రంగ ప్రముఖులు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలంతా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలా బాబాయ్ అంటూ స్పెషల్ గా శుభాకాంక్షలు తెలిపారు.. ఇదిలా ఉంటే తన సోదరుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో చంద్రబాబునాయుడి సతీమణి అయిన నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులు అలాగే బంధువులందరికీ పార్టీ ఇవ్వాలని భావించారు. హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో శనివారం సాయంత్రం పార్టీ ఇచ్చారు.

ఈ పార్టీలో కేవలం నందమూరి వంశంతోపాటు ఇతర బంధువులు అలాగే కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చంద్రబాబునాయుడు, లోకేష్ ప్రత్యేకంగా హాజరయ్యారు. అయితే నందమూరి కుటుంబ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం హాజరుకాలేదు. ఈ పార్టీ ఏర్పాట్లన్నీ నారా భువనేశ్వరి దగ్గరుండి చూసుకున్నారు. వారికీ ఆమె ఆహ్వానం పంపిందా.. లేదా అనేది తెలియలేదు..నందమూరి కుటుంబ వేడుకలకు వీరిద్దరూ కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారు.అయితే ఇలాంటి ప్రత్యేక కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కాకపోవడంతో నందమరి అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

 

The post బాలయ్యకి పద్మభూషణ్.. భువనేశ్వరి పార్టీ.. హాజరవని ఎన్టీఆర్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/balayya-gets-padma-bhushan-bhuvaneswaris-party-ntr-doesnt-attend-is-that-the-reason/feed/ 0