Enter the dragon Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/enter-the-dragon/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 30 Jan 2025 10:09:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Enter the dragon Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/enter-the-dragon/ 32 32 ఎన్టీఆర్ – నీల్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఫ్యాన్స్ కి నచ్చుతుందా..? https://filmybowl.com/interesting-title-for-ntr-neils-movie-will-fans-like-it/ https://filmybowl.com/interesting-title-for-ntr-neils-movie-will-fans-like-it/#respond Thu, 30 Jan 2025 10:09:14 +0000 https://filmybowl.com/telugu/?p=2298 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్...

The post ఎన్టీఆర్ – నీల్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఫ్యాన్స్ కి నచ్చుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు.. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలే వున్నాయి.. ఈ సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

OG : ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..?

అలాగే ఎన్టీఆర్ తన తరువాత సినిమాను కేజీఎఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.. NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ అలాగే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్‌ 31వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా ఎప్పుడు అప్‌డేట్‌లు వస్తాయా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్  మొదలు కానుంది…

ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెడుతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి.అయితే అదే టైటిల్ తో ఇప్పుడు ‘లవ్ టుడే’ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ ఒక చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో మేకర్స్ ఇప్పుడు ‘డ్రాగన్’ టైటిల్ ని అప్డేట్ చేస్తూ, ‘ఎంటర్ ది డ్రాగన్’ గా మార్చారట… తాము అనుకున్న ‘డ్రాగన్’ టైటిల్ ని వేరే సినిమా వాళ్ళు వాడుకున్నారు అనే కారణం చేత మాత్రమే కాదు కథకి తగ్గట్టుగానే ఆ టైటిల్ ని పెట్టినట్టు సమాచారం..ఎన్టీఆర్ కి కూడా ఈ టైటిల్ ఎంతగానో నచ్చేసిందట. ఈ చిత్రం లో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటించబోతుంది… అదే విధంగా లోక నాయకుడు కమల్ హాసన్ ని సైతం ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం నటింపజేయాలనీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రీసెంట్ గానే ఆయనను సంప్రదించాడట. కమల్ హాసన్ కి కూడా ఆ పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం.

 

The post ఎన్టీఆర్ – నీల్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఫ్యాన్స్ కి నచ్చుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/interesting-title-for-ntr-neils-movie-will-fans-like-it/feed/ 0