#balakrishna Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/balakrishna/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 23 Apr 2025 10:59:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #balakrishna Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/balakrishna/ 32 32 అఖండ 2 బిగ్ అప్డేట్.. టీజర్ లోడింగ్..!! https://filmybowl.com/akhanda-2-big-update-teaser-loading/ https://filmybowl.com/akhanda-2-big-update-teaser-loading/#respond Wed, 23 Apr 2025 10:59:45 +0000 https://filmybowl.com/telugu/?p=3743 నందమూరి నటసింహం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబో లో సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ కి పండగే.. బాలయ్య సినిమా కోసం బోయపాటి ఇచ్చే మాస్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చుతాయి…వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం పక్కా. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు...

The post అఖండ 2 బిగ్ అప్డేట్.. టీజర్ లోడింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబో లో సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ కి పండగే.. బాలయ్య సినిమా కోసం బోయపాటి ఇచ్చే మాస్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చుతాయి…వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం పక్కా. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి..తాజాగా ‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ తో మరోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.గత ఏడాది నుండి ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా జరుగుతుంది.

పెద్ది : చరణ్ క్యారెక్టర్ అలా ఉండబోతుందా..?

ఈ మూవీలో క్యూట్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇందులో ఒక పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో లేడీ సూపర్ స్టార్ సీనియర్ నటి విజయశాంతి కూడా నటించబోతుందని సమాచారం…రీసెంట్ గా ఆమెను కలిసి బోయపాటి శ్రీను ఈ స్టోరీని, ఆమె పాత్ర గురించి వివరించగా.. దీంతో ఈ చిత్రం లో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది..

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.. నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెలలో జార్జియాకు వెళుతోంది. మే నెల అంతా జార్జియాలోనే షూటింగ్ చేయనున్నట్లు సమాచారం… అంతేకాదు బాలయ్య పుట్టినరోజు సందర్భం గా జూన్ 10న ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ కాబోతుంది..ఈ అఖండ 2 ని పాన్ ఇండియా వైడ్ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.. ఈ సినిమా లో బాలయ్య నట విశ్వరూపం చూస్తారని దర్శకుడు బోయపాటి తెలిపారు.

 

The post అఖండ 2 బిగ్ అప్డేట్.. టీజర్ లోడింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/akhanda-2-big-update-teaser-loading/feed/ 0
తెలుగు పద్యం అదరగొట్టిన అల్లు అర్హ ..బాలయ్య నే ఆశ్చర్యపరిచిందిగా …!! https://filmybowl.com/allu-arha-who-won-the-telugu-poem-balayya-surprised-me/ https://filmybowl.com/allu-arha-who-won-the-telugu-poem-balayya-surprised-me/#respond Tue, 19 Nov 2024 07:33:58 +0000 https://filmybowl.com/telugu/?p=952 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ” పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దీనితో పుష్ప 2 పై...

The post తెలుగు పద్యం అదరగొట్టిన అల్లు అర్హ ..బాలయ్య నే ఆశ్చర్యపరిచిందిగా …!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ” పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దీనితో పుష్ప 2 పై కూడా భారీగా అంచనాలు పెరిగాయి.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ట్రైలర్ ఆద్యంతము ఎంతగానో ఆకట్టుకుంది.ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ ట్రైలర్ లో వున్నాయి.ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది..

ఆ విషయంలో దేవరతో పోలిస్తే పుష్ప వంద రెట్లు బెటర్ ..బన్నీ స్ట్రాటజీ అదిరిందిగా ..!!

ట్రైలర్ లాంచ్ కు భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి మేకర్స్ పుష్ప ప్రమోషన్స్ మొదలు పెట్టారు.రానున్న రోజులలో మేకర్స్ మరిన్ని భారీ ఈవెంట్స్ ఏర్పాటు చేయనున్నారు.ఇదిలా ఉంటే పుష్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ ఆహా లో పాపులర్ అయిన బాలయ్య అన్ స్టాప్పల్ టాక్ షో కు హాజరయ్యాడు.ఈ సారి బన్నీ తన ఇద్దరి పిల్లలతో కలిసి పాల్గొన్నాడు.ఈ షో లో బాలయ్య అల్లు అర్జున్ పిల్లలతో సరదా ప్రశ్నలు అడిగి ఫన్ క్రియేట్ చేసారు.

ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.ఈ ఎపిసోడ్ ఈ నెల 22 న స్ట్రీమింగ్ కానుంది.అయితే ఈ షో లో బాలయ్య అల్లు అర్హను “నీకు తెలుగు వచ్చా ?” అని అడిగారు.బాలయ్య అలా అడిగిన వెంటనే అర్హ “అటజని కాంచె భూమిసుర అంబర చుంబి ” పద్యం గుక్క తిప్పుకోకుండా చెప్పింది.దీనితో బాలయ్య వెంటనే లేచి అల్లు అర్హకు ముద్దు పెడతారు.అర్హను చూస్తూంటే తెలుగు భాష నాలుగు కాలాలపాటు బ్రతుకుతుందనే నమ్మకం కలిగిందని బాలయ్య చెప్పుకొచ్చారు.

The post తెలుగు పద్యం అదరగొట్టిన అల్లు అర్హ ..బాలయ్య నే ఆశ్చర్యపరిచిందిగా …!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/allu-arha-who-won-the-telugu-poem-balayya-surprised-me/feed/ 0