దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB29’..బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మొదటి సారి మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సూపర్‌స్టార్ మహేష్ ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు.
‘వీరమల్లు’ నైజాం రైట్స్ ఎవరికి దక్కిందంటే..?
ఈ సినిమాకు సంబంధించి టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ లాంటి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.మొదట కెన్యాలో షూట్ చేయాలని భావించినప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా మేకర్స్ ప్లాన్ మార్చి ఇప్పుడు టాంజానియాలోని అద్భుతమైన ప్రకృతి ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు..దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను ఎంతో సీక్రెట్ గా ప్రారంభించి శర వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఆఫీసియల్ అప్డేట్ కావాలని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖుల తో పాటు, ఇతర ప్రముఖ ఇంటర్నేషనల్ స్టార్స్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు… సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఎప్పుడూ లేనంత స్థాయిలో తెరకెక్కుతుంది..త్వరలో మహేష్ బర్త్‌డే వున్న సందర్బంగా ఈ సినిమా నుంచి ఆఫీసియల్ అనౌన్స్మెంట్ ఉంటుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. రాజమౌళి సైతం ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించాలని చూస్తున్నారు…
