గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఇంటర్నేషనల్ గా ఎంతో పాపులర్ అయ్యారు. ఇప్పుడు చరణ్ నటించే సినిమాలన్ని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్నాయి..అయితే రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ప్రేక్షకులను అంతగా మెప్పించిలేదు.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాకపోయినా, చరణ్ మాత్రం వెనకడుగు వేసే పరిస్థితిలో లేడు. ప్రస్తుతం చరణ్ ‘పెద్ది’ అనే హై మాస్ అండ్ యాక్షన్ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ‘ఉప్పెన’సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది.
కింగ్డమ్ : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?
పెద్ది కథ విజయనగరం నేపథ్యంలో సాగనుంది..అయితే అక్కడి వాతావరణం షూటింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో, ఆ సీన్లను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్ వేసి తీయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ సెట్ కోసం ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక క్రికెటర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన చిన్న గ్లింప్స్‌కి అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.
ఈ సినిమా కథ, లుక్ చాలా విభిన్నంగా ఉండనుందని సమాచారం. వచ్చే ఏడాది మార్చి 27 న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా సిద్ధం అయినట్లు సమాచారం… ఈ సినిమాలో హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది..
