MOVIE NEWS

ప్రశాంత్ నీల్ మూవీకి దూరంగా ఎన్టీఆర్.. కారణం అదేనా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ సినిమా డ్రాగన్.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు అయిన మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ సినిమా కావడంతో ప్రశాంత్ నీల్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు  ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది..ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో సినిమా త్వరగా పూర్తి అవుతుందనీ ఫ్యాన్స్ అంచనా వేసారు..

అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు ఎన్టీఆర్ దూరంగా ఉండనున్నాడు.దానికి కారణం వార్ 2. హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ గ్రాండ్ గా నిర్మించింది. భారీ అంచనాల మధ్య వస్తున్నా వార్ 2 సినిమా ఈ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు ప్రశాంత్ నీల్ సినిమాకు ఎన్టీఆర్ బ్రేక్ ఇవ్వనున్నాడు…

దాదాపు నెల రోజుల పాటు వార్ 2 ప్రమోషన్స్ కు కేటాయించి నీల్ సినిమాకు దూరంగా ఉండనున్నాడు.. అందుకు అనుగుణంగా ఎన్టీఆర్ లేని సీన్స్ ను ఫినిష్ చేసేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెకుతున్న డ్రాగన్ ను ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో తెర కెక్కిస్తున్నాడు..

Related posts

అల్లుఅర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు.. తడబడిన ఐకాన్ స్టార్..?

murali

మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!!

murali

యమదొంగ : రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ..!!

murali

Leave a Comment