టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ హిట్ అనిల్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.. ఈ సినిమా తరువాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. అనిల్ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే… చిరు సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముస్సోరీ షెడ్యూల్ ఫినిష్ చేసారు. అక్కడ చిరంజీవి, కేథరీన్ మరియు నయనతార కాంబినేషన్‌లో ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రీకరిస్తున్నాడు.. అయితే కాస్త గ్యాప్ తర్వాత నేటి నుండి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో సినిమలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే చిరు, నయన్ కు సంబంధించి మేజర్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది.. అలాగే ఇదే షెడ్యూల్ లో వెంకీ మామ కూడా జయిన్ అవుతారని సమాచారం.
ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరించ బోతున్నాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు మాస్ మ్యూజిక్ స్పెషలిస్ట్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.. అయితే ఎంతో ఫాస్ట్ గా మొదలైన ఈ సినిమా అంతే ఫాస్ట్ గా పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది.. చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం..రిలీజ్ కి అనుగుణంగానే షూట్ ను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు.అయితే భారీ అంచనాల మధ్య వస్తున్న చిరు – అనిల్ కాంబో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.
