MOVIE NEWS

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం నిర్మాతగా వరుస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో వున్నాడు..తన తమ్ముడు తారక్ తో నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇటీవల తన బ్యానర్ లో వచ్చిన”దేవర” సినిమా భారీ సక్సెస్ అయింది.. త్వరలోనే ఎన్టీఆర్ తో “డ్రాగన్”, దేవర 2 సినిమాలు చేయనున్నాడు.. ఇదిలా ఉంటే కల్యాణ్ రామ్ హీరోగా రాణించేందుకు కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు..2023 లో ఆయన నటించిన చివరి సినిమా “డెవిల్”.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాకు మంచి పేరు  వచ్చింది కానీ కమర్షియల్ గా మాత్రం.అంతగా మెప్పించలేదు.అయితే గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.

దేవర : పార్ట్ 2 లో ఊహకందని సర్ప్రైజ్ లు… మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!!

ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. కల్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.ఇదివరకు ఎన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్‌ కనిపించబోతున్నాడు. ”కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా అవుట్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా గా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు గత కొన్నాళ్లుగా ‘మెరుపు’ అనే టైటిల్ వినిపించింది.

అయితే తాజాగా ఈ సినిమాకు “ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి “.. అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసారు..ఉమెన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ రివీల్ చేసారు..అలాగే ఈ సినిమాలో సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా సోహేల్ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు..

 

 

Related posts

పూరి జగన్నాథ్‌ కి హీరో నే దొరకట్ లేదు….

filmybowl

కింగ్డమ్ : ట్రైలర్ రిలీజ్ కి అంతా సిద్ధం..!!

murali

New OTT Releases This Week: Mana Shankara Vara Prasad Garu, Anaganaga Oka Raju, Kohrra Season 2 and More

filmybowl

Leave a Comment