పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన మూవీ ‘హరిహర వీరమల్లు’.. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిష్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ప్రారంభించిన ఈ హిస్టారికల్ డ్రామా చివరికి జ్యోతికృష్ణ చేతుల మీదుగా పూర్తి కావడంతో ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు, ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ యాక్షన్ తో పాటు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ ను సైతం ఎంతగానో మెచ్చుకుంటున్నారు.ఈ సినిమాకు కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. పవన్ ఫ్యాన్స్ సైతం కీరవాణి మ్యూజిక్ శైలిని చూసి ఫిదా అయిపోతున్నారు.
war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!!
అయితే కీరవాణి మ్యూజిక్ అనగానే రాజమౌళి సినిమానే గుర్తొస్తుంది.. మిగిలిన సినిమాలకు కీరవాణి మ్యూజిక్ కు ఫ్యాన్స్ నుంచి అంత ఫేమ్ ఉండేది కాదు.కానీ వీరమల్లు సినిమాకు కీరవాణి మ్యూజిక్ మెయిన్ అసెర్ట్ గా నిలిచింది..సినిమాలోని కీలక సన్నివేశాలను ఎలివేట్ చేసిన విధానం, పవన్ కళ్యాణ్‌కి తగ్గట్టు దూకుడుగా కంపోజ్ చేసిన ట్యూన్స్ అన్నీ ఈ చిత్రానికి ప్లస్ గా నిలిచాయి. దీంతో కీరవాణి మ్యూజిక్ వర్క్ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా చూసిన ప్రేక్షకులు “పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు.. ఈసారి కీరవాణి కూడా స్క్రీన్‌ను దద్దరిల్లించేశాడు” అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు..
పార్ట్ 2 కి అదిరిపోయే ఎండింగ్ ఇచ్చిన మేకర్స్ పార్ట్ 2 తెరకెక్కుతుందా లేదా అనేది అనుమానంగా మారింది..పార్ట్ 1 కె ఇన్నేళ్లు పట్టగా పార్ట్ 2 అసలు వస్తుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.. కానీ అసలు కథ అంతా పార్ట్ 2 లోనే ఉన్నట్టు తెలుస్తుంది.
