MOVIE NEWS

కూలీ : తెలుగు గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.జైలర్ సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చిన తలైవా ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు చూస్తున్నారు.. ఈ సినిమాలో కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం ఆగస్టు 14న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది..

SSMB 29: షూటింగ్ బిగ్ అప్డేట్.. సరికొత్త లొకేషన్స్ లో లేటెస్ట్ షెడ్యూల్..!!

ఇప్పటికే ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించగా తాజాగా హైదరాబాద్ లో కూడా అనిరుధ్ ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. జులై 22న ఈ ఈవెంట్ జరగనుంది. . ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈవెంట్ లో రజినీ పాల్గొంటారా లేదా అనేది క్లారిటీ రావాల్సి వుంది. ఈ ఈవెంట్ లో అనిరుధ్ ఏకంగా మూడు పాటలు స్వయంగా పాడబోతున్నాడటా.. గ్యాంగ్ స్టర్ కథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2” కూడా రిలీజ్ కానుంది.. దీనితో ఈ బాక్స్ ఆఫీస్ వార్ భారీ స్థాయిలో జరగనుంది..రెండు భారీ బడ్జెట్ మూవీస్ కావడంతో అంచనాలు కూడా భారీగా వున్నాయి..

Related posts

హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..?

murali

బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!!

murali

ఆర్జీవి : పుష్ప రాజ్ ముందు అల్లు అర్జున్ సైతం దిగదుడుపే..!!

murali

Leave a Comment