గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ అలాగే సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ స్టార్ దివ్యేందు అలాగే విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
‘కింగ్డమ్’ మూవీ హిందీ టైటిల్ మార్పు.. కారణం ఏమిటంటే..?
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రాంచరణ్ బర్త్‌డే సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంపై రాం చరణ్ మరింత హైప్ పెంచాడు.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ పిక్‌లో చరణ్ గుబురు గడ్డం, చిన్న పిలక, సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొడుతున్నాడు… ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. హాలీవుడ్ హీరోలా ఉన్నారని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు..గేమ్ ఛేంజర్ సినిమాతో డీలా పడ్డ రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…పెద్ది సినిమాతో రాంచరణ్ ఈ సారి మాస్ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు..
