మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ విశ్వంభర”.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.. క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ పై ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.2023 దసరా సందర్భంగా ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ రాగా సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు వశిష్ఠ ఈసారి ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇవ్వబోతున్నాడట.
హరిహర వీరమల్లు : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్స్ ఎవరంటే..?
తాజా ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ..”గతంలో ట్రోల్స్ ఎలా వచ్చాయో తెలుసు. కానీ ఈసారి ట్రైలర్ చూస్తే ట్రోల్స్ చేసిన వాళ్లే కచ్చితంగా మెచ్చుకుంటారు. విశ్వంభర ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని తెలిపారు.. సినిమా ఎంతో గ్రాండియర్ గా, విజువల్ వండర్ గా ఉంటుంది ” అని దర్శకుడు వశిష్ఠ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు.ప్రస్తుతం వశిష్ఠ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే మొదటి నుంచి కూడా విశ్వంభర సినిమా చిరంజీవి నటించిన క్లాసిక్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందని న్యూస్ వైరల్ అయింది… దీంతో వశిష్ఠ ఈ వార్త పై కూడా స్పందించారు.మన పురాణాల ప్రకారం 14 లోకాలు ఉంటాయి. స్వర్గం, పాతాళం, యమలోకం ఇలా అన్ని లోకాలకు మెయిన్ లోకం సత్యలోకం. ఇప్పటివరకు చాలామంది డైరెక్టర్స్ తమకు నచ్చిన పద్ధతిలో నచ్చిన లోకాన్ని చూపించారు. కానీ నేను ఇప్పుడు సత్యలోకాన్నీ చూపించబోతున్నాను. విశ్వం మొత్తాన్ని భరించేదే విశ్వంభర. అక్కడ ఉన్న హీరోయిన్ కోసం హీరో 14 లోకాలు దాటి వెళ్తాడు. ఆ సత్యలోకం నుంచి హీరోయిన్‌ను హీరో ఎలా కిందకు తీసుకొచ్చాడు అనేది కథ’ అని వశిష్ఠ చెప్పుకొచ్చాడు.దీనితో సినిమాపై ప్రేక్షకులలో మరింతగా ఇంట్రెస్ట్ పెరిగింది.
