ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది నటించిన పుష్ప 2 సినిమా సంచలన విజయం సాధించింది..అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం కొల్లగొట్టి బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేసి 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాడు…ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అల్లు అర్జున్ ప్రపంచ స్థాయి హీరోగా మారాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
మెగా 157 : శరవేగంగా షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..?
ఈ సినిమాకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని శరవేగంగా పూర్తి చేయాలని అట్లీ అండ్ టీం చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. వీలైనంత తొందరగా ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లి శరవేగంగా షూటింగ్ చేయాలనే ఆలోచనలో అట్లీ ఆలోచిస్తున్నట్లు సమాచారం..సెప్టెంబర్ నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు మూడు నెలల పాటు ముంబైలోనే షూటింగ్ జరపే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా న్యూస్ వైరల్ అవుతుంది..
షూటింగ్ తర్వాత విఎఫ్ఎక్స్ కి సంబంధించిన పనులను కూడా స్టార్ట్ చేసి అవి కూడా వేగవంతంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ అట్లీ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ పుష్ప 3 లో నటించనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..
